నిద్రిస్తుండగా ఏలియన్లు నన్ను కిడ్నాప్ చేస్తున్నాయ్.. ఎక్కడో మేలుకుంటున్నా.. బాడీపై వింత గాట్లు

Published : Jun 16, 2022, 06:03 PM ISTUpdated : Jun 16, 2022, 06:30 PM IST
నిద్రిస్తుండగా ఏలియన్లు నన్ను  కిడ్నాప్ చేస్తున్నాయ్.. ఎక్కడో మేలుకుంటున్నా.. బాడీపై వింత గాట్లు

సారాంశం

నిద్రలో ఉన్నప్పుడు తనను గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేస్తున్నాయని, మేలుకవకు వచ్చేసరికి తన బాడీపై వింత గాట్లు, గాయాలు కనిపిస్తాయని అమెరికాకు చెందిన ఓ మహిళ పేర్కొన్నారు. అంతేకాదు, ఒక్కోసారి తాను తను పడుకున్న ఇంటికి చాలా దూరంలో మేలుకుంటానని, ఒకసారైతే ట్యాక్సీ పట్టుకుని ఇంటికి రావల్సి వచ్చిందని చెప్పారు.

న్యూఢిల్లీ: ఏలియన్ల గురించిన చర్చ పురోగమి, తిరోగమిల వైపు రెండు వైపులకు దారి తీస్తుంది. కొందరేమే ఏలియెన్లే దేవుళ్లని వాదిస్తుండగా కొందరు సౌర కుటుంబం వెలుపలా ప్రాణులు జీవించే అవకాశం ఉండొచ్చు కదా అనే వాదన తెస్తుంటారు. ఈ చర్చ జరుగుతుండగా గ్రహాంతర వాసులను తాము చూశామని, కాదు కాదు.. వాటి వాహనాలు (యూఎఫ్‌వో) చూశామని ఇంకొందరు చెబుతుంటారు. అయితే, అమెరికాకు చెందిన మేరియా లీవా మాత్రం తాను నిద్రిస్తున్నప్పుడు గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేస్తున్నాయని వాదిస్తున్నారు. ఆమె ఇంకా ఏం చెబుతున్నారంటే..

తాను నిద్రిస్తున్నప్పుడు చాలా సార్లు గ్రహాంతర జీవులు తనను అపహరించాయని ఆమె వాదిస్తున్నారు. లేచి చూసుకుంటే తన దేహంపై చాలా చోట్ల వింత గాట్లు, గాయాలు కనిపిస్తుంటాయని వివరించారు. అంతేకాదు, అక్కడక్కడ చిన్నపాటి రంధ్రాలు వంటి గాయాలు కూడా ఉంటాయని తెలిపారు. అలా తనను కిడ్నాప్ చేసినప్పుడు కొన్నిసార్లు తన ఇంటికి దూరంగా మరెక్కడో మేలుకుంటానని వివరించారు. ఒక సారైతే ట్యాక్సీ పట్టుకుని ఇంటికి రావల్సి వచ్చిందని అన్నారు.

తనకు నాలుగేళ్లు ఉన్నప్పటి నుంచి ఏలియెన్ల జ్ఞాపకాలు తనకు ఉన్నాయని చెప్పారు. కొలంబియాలో తన తల్లిదండ్రుల నివాసంలో ఉంటున్నప్పుడు తాను ఇంటి టెర్రస్ మీదికి వెళ్లి చుక్కలను చూస్తూ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని, తనను అక్కడ ఎందుకు వదిలిపెట్టారని, ఇంటికి తీసుకెళ్లాలని ఏడ్చినట్టు కూడా గుర్తున్నదని పేర్కొన్నారు. ఆకాశంలో చాలా వస్తువులను తాను చూడగలదని, ఒక్కోసారి ప్రాణులను కూడా చూడగలదని చెప్పారు.

ఒక్కోసారి రాత్రి 2 నుంచి 4 గంటల మధ్యలో టెలిపథిక్ కమ్యూనికేషన్ ద్వారా లేచిన సందర్భాలు ఉన్నాయని, లేచి కిటికీ వద్దకు వెళ్లాని చెబితే వెళ్లి చూడగా అక్కడ వింత ఆకారాలు కనిపించేవని చెప్పారు. కొన్నిసార్లు వాటిని తన ఫోన్‌లో వీడియో రికార్డు చేశానని, మరికొన్ని సార్లు ఫొటోలు తీశానని పేర్కొన్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు తనపై తనకు నియంత్రణ ఉండదని చెప్పారు.

ఒక్కోసారి ఏలియెన్లు తన వద్దకు రావడానికి ముందు కలల ద్వారా కూడా కమ్యూనికేట్ అయ్యేవారని, అవి వస్తున్నట్టు తనకు తెలిసేదని అన్నారు. అవి తనను విజిట్ చేసినప్పుడు తన బాడీపై గాయాల వంటివి గాట్ల వంటివి ఉండేవని చెప్పారు. తన చేతి వేళ్లకు పంక్చర్లు ఉండేవని తెలిపారు. తద్వార ఆ రోజు రాత్రి ఏదో జరిగిందనే నిర్ధారణకు తాను వచ్చేదన్ని అని వివరించారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆమె తల్లి కూడా ఇలాగే మాట్లాడింది.

కొలంబియాలోని తన తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఏలియెన్లు కిడ్నాప్ చేశాయని, తాను నిద్రలో నుంచి మేలుకుని చూస్తే ఎక్కడో దూరంగా విడిచి పెట్టబడి ఉన్నానని అన్నారు. తాను తిరిగి ఇంటికి వెళ్లడానికి ట్యాక్సీ మాట్లాడుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఇంటి తాళం చెవి కూడా తన దగ్గర లేకపోవడంతో తండ్రి రూమ్ డోర్ కొట్టాల్సి వచ్చిందని చెప్పారు.

తాను చాలా సార్లు ఏలియెన్లను చూశానని వివరించారు. ఒకసారి బార్సిలోనాలోనూ కొండల్లో ఈ గ్రహాంతరవాసులను వీక్షించినట్టు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే