బొమ్మ తుపాకీతో బెదిరించిన నటిని కాల్చేసిన పోలీసులు

By rajesh yFirst Published Sep 1, 2018, 6:00 PM IST
Highlights

టెలివిజన్‌ సిరీస్‌ ఈఆర్‌ తో ఫేమస్ అయిన హాలీవుడ్‌ నటి వెనెస్సా మార్క్యూజ్‌(49) బొమ్మతుపాకీతో బెదిరించి పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. లాస్‌ఏంజిల్స్‌‌లోని వెనస్సా నివాసానికి తనిఖీలకు వెళ్లిన పోలీసులను చూసిన ఆమె బొమ్మతుపాకీ ఎక్కుపెట్టింది. బొమ్మ తుపాకీ నిజం తుపాకీ అని భావించిన పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  

లాస్‌ఏంజిల్స్‌: టెలివిజన్‌ సిరీస్‌ ఈఆర్‌ తో ఫేమస్ అయిన హాలీవుడ్‌ నటి వెనెస్సా మార్క్యూజ్‌(49) బొమ్మతుపాకీతో బెదిరించి పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. లాస్‌ఏంజిల్స్‌‌లోని వెనస్సా నివాసానికి తనిఖీలకు వెళ్లిన పోలీసులను చూసిన ఆమె బొమ్మతుపాకీ ఎక్కుపెట్టింది. బొమ్మ తుపాకీ నిజం తుపాకీ అని భావించిన పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  

నటి వెనెస్సా మార్క్యూజ్‌ ఇంటి యజమాని ఆమె నివాసం ఉంటున్నఇంటిని తనిఖీ చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆమె ఒక రకమైన మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంటకుపైగా ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టగా ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి చికిత్స చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. 

సరిగ్గా ఆ సమయంలో ఆమె తన చేతిలోకి ఓ తుపాకీ తీసుకొని పోలీసుల వైపు ఎక్కుపెట్టింది. దీంతో అక్కడే ఉన్న ఓ అధికారి ఆమెపై కాల్పులు జరిపాడని పోలీసులు స్పస్టం చేశారు. మార్క్యూజ్‌ 1994 నుంచి 1997 వరకూ ప్రసారమైన ఈఆర్‌ టెలివిజన్‌ సిరిస్‌లో నర్సు పాత్రలో నటించారు.  సైయిన్‌ఫెల్డ్‌, మెల్‌రోస్‌ ప్లేస్‌ వంటి షోల్లోనూ అలరించారు.

గతేడాది లైంగిక వేధింపులు, జాతి వివక్షపై టీవీ షోలో మాట్లాడినందుకు ఆమెను ఆ కార్యక్రమం నుంచి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆమె సహనటుడు జార్జ్‌ కూన్లీనే అనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.  ఆమెను తొలగించడానికి నేను రచయితను, నిర్మాతను, డైరెక్టర్‌ను కాదు కేవలం నటుడిని మాత్రమేనని కూన్లీ వివరణ ఇచ్చుకున్నారు.

click me!