యూరప్‌లో అంతుచిక్కని కాలేయ వ్యాధి కలకలం.. 169 కేసులు నమోదు.. ఓ చిన్నారి మృతి: డబ్ల్యూహెచ్‌వో

Published : Apr 24, 2022, 06:14 PM ISTUpdated : Apr 24, 2022, 06:30 PM IST
యూరప్‌లో అంతుచిక్కని కాలేయ వ్యాధి కలకలం.. 169 కేసులు నమోదు.. ఓ చిన్నారి మృతి: డబ్ల్యూహెచ్‌వో

సారాంశం

యూరప్‌లో అంతుచిక్కని కాలేయ వ్యాధి కలకలం రేపుతున్నది. అమెరికా సహా ఐరోపా దేశాల్లో ఈ మిస్టీరియస్ లివర్ డిసీజ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయయని, ఒక చిన్నారి ఈ డిసీజ్‌తో మరణించాడని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.  

న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా మహమ్మారి పీడకల నుంచి ప్రపంచం బయటపడలేదు. తాజాగా, అమెరికా, ఐరోపా దేశాల్లో మరో వైరస్ కలకలం రేపుతున్నది. ఈ అంతుచిక్కని కాలేయ వ్యాధితో ఐరోపా దేశంలో ఒక చిన్నారి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ అంతుచిక్కని కాలేయ వ్యాధిపై డబ్ల్యూహెచ్‌వో శనివారం స్పందించింది. ఇప్పటి వరకు ఈ మిస్టీరియస్ డిసీజ్‌తో 169 కేసులు నమోదయ్యాయని వివరించింది. ఈ మిస్టీరియస్ డిసీజ్ ఒక్క నెల నుంచి 16 ఏళ్ల వరకు పిల్లల్లో సోకినట్టు తెలిపింది. కాగా, ఇందులో 17 మంది చిన్నారులకు కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 

అయితే, ఈ తీవ్ర కాలేయ వ్యాధితో చిన్నారి మరణించిన దేశం పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఈ డిసీజ్ తొలి కేసు బ్రిటన్‌లో రిపోర్ట్ అయింది. ఇక్కడ 114 మంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారు.

ఇలా కేసులు పెరగడానికి గల స్పష్టమైన కారణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పలేకపోయింది. ఇక్కడ నిజంగా హెపటైటిస్ కేసులు పెరిగాయా? లేక సాధారణంగా చోటుచేసుకునే కేసులపైనే ఎక్కువ అవగాహన కలిగిందా? అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది. 

జలుబును కలుగజేసే వైరస్‌కు సంబంధించినదే ఈ అంతుచిక్కని వ్యాధికి కారణభూతంగా ఉన్నదేమోనని నిపుణులు యోచిస్తున్నారు. అయితే, పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. అడినోవైరస్ దీనికి కారణమై ఉండొచ్చనే హైపోథీసిస్‌లు వస్తున్నాయని, కానీ, స్పష్టంగా ఈ మిస్టీరియస్ డిసీజ్‌కు గల కారణాల కోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. ఎందుకంటే.. ఈ అడినోవైరస్ దాదాపు 74 కేసుల్లోనూ కనిపించిందని తెలిపింది. కాగా, కనీసం 20 మందికి కరోనా పాజిటివ్ అని కూడా తేలిందని పేర్కొనడం గమనార్హం. ఈ కేసులు వెలుగుచూసిన దేశాలు చిన్నారుల్లో హెపటైటిస్ కేసులపై నిఘా వేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ కాసేలోడ్, మరణాల సంఖ్య వరుసగా 509,166,036 మరియు 6,216,725గా ఉందని వెల్లడించింది.  అయితే మొత్తం టీకా మోతాదుల సంఖ్య 11,233,194,944కి పెరిగింది. CSSE ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసులు మరియు మరణాలు అమెరికాలో న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మొత్తం 80,971,925 క‌రోనా వైరస్ కేసులు న‌మోదుకాగా, 991,231 మంది మ‌రణించారు. అమెరికా త‌ర్వాత క‌రోనా వైర‌స్ కేసులు అత్య‌ధికంగా భార‌త్ లో న‌మోద‌య్యాయి. భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,30,57,545 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వైర‌స్ తో పోరాడుతూ.. 5,22,193 మంది చ‌నిపోయారు. గ‌త కొంత కాలంగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా ప్ర‌భావం భార‌త్ లో మ‌ళ్లీ పెరుగుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా కేసులు నమోదవుతున్న ఇతర దేశాలు ఇలా ఉన్నాయి...  బ్రెజిల్ (30,345,808) ఫ్రాన్స్ (28,435,100), జర్మనీ (24,180,512), UK (22,106,306), రష్యా (17,864,332), దక్షిణ కొరియా (16,895,194), ఇటాలియన్, 69,190,6971 స్పెయిన్ (11,736,893) , వియత్నాం (10,554,689) లు టాప్ లో ఉన్నాయి. అలాగే, 100,000 కంటే ఎక్కువ మంది క‌రోనా వైర‌స్ తో చ‌నిపోయిన దేశాలు వ‌రుస‌గా.. బ్రెజిల్ (662,855), భారతదేశం (522,116), రష్యా (367,203), మెక్సికో (324,033), పెరూ (212,724), UK (173,985), ఇటలీ (162,160), ఇండోనేషియా (162,1560) , ఫ్రాన్స్ (146,057), ఇరాన్ (140,952), కొలంబియా (139,771), జర్మనీ (134,179), అర్జెంటీనా (128,344), పోలాండ్ (115,948), స్పెయిన్ (103,721) మరియు దక్షిణాఫ్రికా (100,298) టాప్ లో ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే