యేడాది చిన్నారిని కాల్చి చంపిన ఎనిమిదేళ్ల బాలుడు.. తండ్రి అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Jun 29, 2022, 8:05 AM IST
Highlights

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. అయితే ఈ సారి ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తుపాకీతో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు యేడాది పసిపాపను కాల్చి చంపాడు. ఆ బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

వాషింగ్టన్ : United Statesలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. Gunలు పిల్లలకు ఆటవస్తువుల్లా మారిపోతున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా ఈ వీకెండ్ లో ఫ్లోరిడాలో 8-Year-Old తన తండ్రి తుపాకీతో ఆడుకుంటూ ఓ యేడాది చిన్నారిని కాల్చి చంపగా, మరో రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు. 

ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తండ్రి, రోడెరిక్ రాండాల్‌(45)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని మీద నేరపూరిత నిర్లక్ష్యం,చట్టవిరుద్ధంగా తుపాకీ కలిగి ఉండటం, సాక్ష్యాలను దాచడానికి ప్రయత్నించడం వంటి అభియోగాలు మోపారని ఎస్కాంబియా కౌంటీ షెరీఫ్ చిప్ సిమన్స్ తెలిపారు. ఇప్పటికే అమెరికా కాల్పుల మోతతో వణికిపోతోంది. తాజాగా ఈ ఘటన షాక్ కి గురి చేసింది. 

రోడెరిక్ రాండాల్‌ లు నేర చరిత్ర ఉంది. అతను ఒక మోటల్ లో తన గర్ల్ ఫ్రెండ్ ను కలుసుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో తన ఎనిమిదేళ్ళ కుమారుడిని వెంట తీసుకెళ్లాడు. ఆమె కూడా రెండేళ్ల వయసున్న కవలలను, ఏడాది వయసున్న చిన్నారిని వెంట పెట్టుకుని వచ్చింది. వీరంతా మోటల్ లో బస చేశారు. ఈ క్రమంలో రోడెరిక్ రాండాల్‌ బయటికి వెడుతూ.. తన గన్ ను డ్రాలో వదిలి వెళ్లాడు.

అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు..

పిల్లలందరూ ఆడుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ నిద్రపోయింది. ఇంతలో ఎనిమిదేళ్ల చిన్నారి డ్రాలోనుంచి తుపాకీ తీసి దాంతో ఆడుకోవడం ప్రారంభించాడు. అలా ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో ఆ తూటా ఏడాది చిన్నారికి తగిలి మరణించింది. రెండు సంవత్సరాల వయసున్న కవలల్లో ఒకరికి మరో బుల్లెట్ తగిలింది. అతను ప్రాణాపాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.. అని పోలీసులు తెలిపారు. 

తండ్రి తిరిగి గదికి వచ్చేసరికి జరిగిన దారుణం గమనించాడు. వెంటనే పోలీసులు వచ్చేలోగా కొడుకు చేతిలోని గన్ ను తీసుకున్నాడు. దీంతో పాటు అనుమానిత డ్రగ్స్ లాంటి పదార్థాన్ని రూంలోనుంచి బైటికి తీసుకువెళ్లి దాచాడు. ఇది పోలీసులు కనిపెట్టారు. అయితే.. కాల్పుల ఘటనల్లో అనుకోకుండా జరగడం ఒక ఎత్తైతే.. యేడాది చిన్నారి మరణించడం మరో విషాదం. 

ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ తాజా నివేదికల ప్రకారం.. యేటా అమెరికాలో వందలాదిమంది చిన్నారులకు ఇలా అక్రమ గన్ లు అల్మారాలు, నైట్‌స్టాండ్ డ్రాయర్‌లలో, బ్యాక్‌ప్యాక్‌లు, పర్సుల్లో లేదా వాడి నిర్లక్ష్యంగా వదిలేసిన తుపాకులు ఇళ్లల్లోనే దొరుకుతున్నాయట. అంతేకాదు పిల్లలు వాటితో ఆడుకుంటూ..తమను తాము కాల్చుకోవడం లేదా ఎవరినైనా కాల్చడం చేస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. 

ఈ సంస్థ ఆయుధాల నియంత్రణను పెంచాలని పోరాడుతోంది.. దీని ప్రకారం యేటా.. ఇలా మైనర్లు "అనుకోకుండా జరిపే కాల్పులు" వల్ల సగటున 350 మరణాలకు సంభవిస్తున్నాయని అంచనా వేసింది. గన్ వాయోలెన్స్ ఆర్కైవ్ వెబ్‌సైట్ ప్రకారం, తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో పాటూ.. యునైటెడ్ స్టేట్స్‌లో సంవత్సరానికి సుమారు 40,000మంది ఇలా కాల్పుల్లో మరణిస్తున్నారని తెలిపింది.  

click me!