ఘోర విషాదం: భవనంలో అగ్నిప్రమాదం... 70 మంది సజీవదహనం

By Siva KodatiFirst Published Feb 22, 2019, 7:31 AM IST
Highlights

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 70 మంది సజీవదహనమయ్యారు. ఓల్డ్ ఢాకాలోని చాక్‌బజార్‌లో ఉన్న నాలుగంతస్తుల ‘హాజీ వహెచ్ భవంతి’’లో బుధవారం రాత్రి 10.40 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 70 మంది సజీవదహనమయ్యారు. ఓల్డ్ ఢాకాలోని చాక్‌బజార్‌లో ఉన్న నాలుగంతస్తుల ‘హాజీ వహెచ్ భవంతి’’లో బుధవారం రాత్రి 10.40 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే అగ్నికీలలు పక్క భవనాలకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ దాదాపు 14 గంటల పాటు శ్రమిస్తే గానీ మంటలు అదుపులోకి రాలేదు.

ఈ ప్రమాదంలో సుమారు 70 మంది సజీవదహనమవ్వగా... 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సదరు భవంతిలోని కింది అంతస్తులో రసాయనాలు, కాస్మోటిక్స్, పర్‌ఫ్యూమ్‌లను నిల్వ ఉంచే గోదాముగా మార్చారు.

మంటలు వీటికి అంటుకోవడంతో పేలుడు సంభవించింది. దీనికి తోడు ఆ సమయంలోనే అక్కడికి సమీపంలో ఓ వివాహం జరగడం, రెస్టారెంట్లు, హోటళ్లలో జనాలు భారీగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగింది.

ఈ ఘోరంలో కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయనీ, వీటికి డీఎన్ఏ పరీక్షలు అవసరమవుతాయని వెల్లడించారు. రాత్రి కావడంతో ఓ భవంతి ప్రధాన ద్వారానికి తాళం వేశారు.. మంటలు చుట్టుముట్టడంతో చాలామంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ ప్రమాదంపై బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్ధుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు లక్ష టాకాలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల టాకాలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. 

click me!