Romania Helicopter Crash: రొమేనియాలో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాప్టర్..ఏడుగురు సైనికుల మృతి

Published : Mar 03, 2022, 05:14 AM IST
Romania Helicopter Crash: రొమేనియాలో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాప్టర్..ఏడుగురు సైనికుల మృతి

సారాంశం

Romania Helicopter Crash: తూర్పు రొమేనియాలోని నల్ల సముద్రం సమీపంలో ఆ దేశ‌ ఆర్మీ హెలికాప్టర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు సైనికులు మరణించినట్టు రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తప్పిపోయిన ఫైటర్ జెట్ మరియు దాని పైలట్ కోసం వెతుకుతున్న సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం.  

Romania Helicopter Crash: తూర్పు రొమేనియాలోని నల్ల సముద్రం సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు సైనికులు మరణించినట్టు రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. బుధవారం IAR 330 ప్యూమా హెలికాప్టర్ ఎయిర్ బేస్ నుంచి దాదాపు 20:21కి బయలుదేరింది. బ‌యలు దేరిన 20 నిమిషాల‌కే జెట్ కంట్రోల్ టవర్‌తో రేడియో సంబంధాన్ని కోల్పోయింది. రాడార్ నుండి అదృశ్యమైంది. 20:44 సమయంలో రాడార్ నుండి అదృశ్యమైందని జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

IAR 330-Puma హెలికాప్టర్ ఎయిర్‌ఫీల్డ్‌కు 11 కిలోమీటర్ల (ఏడు మైళ్లు) దూరంలో ఉన్న గురా డోబ్రోగేయ్ ప్రాంతంలో కూలిపోయింద‌ని అధికారులు తెలిపారు. తప్పిపోయిన ఫైటర్ జెట్ , దాని పైలట్ కోసం వెతుకుతున్న సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని రక్షణ మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది. మిగ్ 21 లాన్స్‌ఆర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ ప్ర‌మాదంపై మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనరల్ కాన్‌స్టాంటిన్ స్పాను మాట్లాడుతూ..ప్రతికూల వాతావరణ పరిస్థితుల వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఈ ప్ర‌మాదాల‌పై  రెండు విచారణ కమిషన్‌లను ఏర్పాటు చేసామని చెప్పారు.

MiG 21 LanceR ప్ర‌మాదాలు
 
2018లో కూడా ఇలాంటి ప్ర‌మాద‌మే జ‌రిగింది. రొమేనియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి బ‌య‌లు దేరిన  MiG21 లాన్సర్ ఫైటర్ జెట్ కాసేప‌టికే  క్రాష్ అయింది.  ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చ‌నిపోయారు. రొమేనియన్ వైమానిక దళం ఆధునీకరిస్తున్నప్పటికీ..  వైమానిక దళం ఎయిర్ పోలీసింగ్ మిషన్ల కోసం సోవియట్ కాలం నాటి మిగ్‌లపై ఆధారపడుతుంది.

PREV
click me!

Recommended Stories

అమెరికా సైనికులు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు.? అస‌లేం జ‌రుగుతోంది.?
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?