కాంగో నదిలో పడవ బోల్తా... 60మంది దుర్మరణం

By telugu news teamFirst Published Feb 16, 2021, 7:15 AM IST
Highlights

నది నీటిలో మునిగిన ఓడలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి చెప్పారు. ఓడ మునిగిన తర్వాత 60 మంది మృతదేహాలను వెలికితీయగా, మరికొంతమంది గల్లంతయ్యారని మంత్రి చెప్పారు. 


కాంగో నదిలో ఓ పెద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మాయి నోడోంబీ ప్రావిన్సులోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ మునిగింది. నది నీటిలో మునిగిన ఓడలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి చెప్పారు. ఓడ మునిగిన తర్వాత 60 మంది మృతదేహాలను వెలికితీయగా, మరికొంతమంది గల్లంతయ్యారని మంత్రి చెప్పారు. 

ఓడలో 300 మంది ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఓడ పడవ కిన్షాసా నుంచి బయలుదేరి భూమధ్యరేఖ ప్రావిన్సు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో ఎక్కువమంది ప్రయాణికులు ఉండటంతో ఓవర్ లోడ్ వల్ల మునిగిందని మంత్రి చెప్పారు. 

click me!