Earthquake: మెక్సికోను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందంటే..? 

Published : Jun 19, 2023, 05:36 AM IST
Earthquake: మెక్సికోను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందంటే..? 

సారాంశం

Earthquake: మెక్సికోలో భూకంపం సంభవించింది. సెంట్రల్ మెక్సికోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

Earthquake: మెక్సికోలో మరోసారి భూకంపం సంభవించింది. అందిన సమాచారం ప్రకారం సెంట్రల్ మెక్సికోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం..సోమవారం  తెల్లవారుజామున 2:00 గంటలకు సెంట్రల్ మెక్సికో తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.

గత నెలలో రెండుసార్లు భూకంపం 

గత నెలలో మెక్సికోలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. మే 25న పనామా-కొలంబియా సరిహద్దుకు సమీపంలో ఉన్న కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు. ఇది కాకుండా మే 18న మెక్సికోలో భూకంపం వచ్చింది. ఆ సమయంలో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. గ్వాటెమాలలోని కెనిలా మున్సిపాలిటీకి ఆగ్నేయంగా 2 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉంది.

PREV
click me!

Recommended Stories

USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక
USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే