లైట్లు పనిచేయక, జనం మీదకు దూసుకెళ్లిన ట్రక్కు: 32 మంది మృతి

Siva Kodati |  
Published : Mar 28, 2019, 02:37 PM IST
లైట్లు పనిచేయక, జనం మీదకు దూసుకెళ్లిన ట్రక్కు: 32 మంది మృతి

సారాంశం

గ్వాటెమాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జనం మీదకు ట్రక్కు దూసుకెళ్లడంతో 32 మంది దుర్మరణం పాలయ్యారు. 

గ్వాటెమాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జనం మీదకు ట్రక్కు దూసుకెళ్లడంతో 32 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి  వెళితే.. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో బుధవారం రాత్రి ఓ కారు, పాదచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డు మీద పడిపోయాడు.

అతనికి ఏమైందోనని జనం కంగారుగా అక్కడ గుమికూడారు. ఆ సమయంలో ట్రక్కు లైట్లు పనిచేయకపోవడంతో, చీకటిగా ఉండటంతో రోడ్డుపై ఉన్న జనాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో వేగంగా వారిని ఢీకొట్టింది.

ట్రక్కు వేగానికి జనం రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 32 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు  చేపట్టారు. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో