
అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. కాలిఫోర్నియాలోని గిల్‌రాయ్‌లో ఫుడ్‌ఫెస్టివల్‌కు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. 12 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.