లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

Published : Jun 14, 2022, 07:52 AM IST
లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

సారాంశం

లాస్ ఏంజెల్స్‌లోని వేర్‌హౌస్ పార్టీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు.నలుగురు గాయపడ్డారు.

లాస్ ఏంజిల్స్ : అమెరికాలో కాల్పుల ఘటనలు కలవరపెడుతున్నాయి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట Firingతో సామాన్యపౌరులు మరణించిన ఘటనలు నమోదవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 
Los Angelesలో Warehouse party సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి అధికారి జాడర్ చావెస్ ప్రకారం, సోమవారం ఉదయం గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాయిల్ హైట్స్ పరిసర ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన కాల్పులకు గల కారణాలను డిటెక్టివ్‌లు ఇంకా నిర్ధారించలేదు. ఎలాంటి అనుమానిత సమాచారం వెలువడలేదు. డిటెక్టివ్‌లు, ఫోరెన్సిక్ ఫోటోగ్రాఫర్‌లు కాల్పుల దృశ్యాన్ని డాక్యుమెంట్ చేశారు. దీనికి కొన్ని గంటల సమయం పట్టడంతో స్నీకర్‌తో సహా, రోడ్ల మీద రక్తం మరకలు, బట్ట పేలికలు అలాగే ఉండిపోయాయి.

ఇక గాయపడిన నలుగురిలో, సోమవారం నాటికి ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చావెస్ తెలిపారు. ఇక చనిపోయిన ముగ్గురిలో కూడా ఆస్పత్రికి చేసుకునేసరికే ఇద్దరు చనిపోగా, ఆస్పత్రికి వచ్చాక మూడో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని నిర్ణారించారు. 

లాస్ ఏంజెల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్-కరోనర్ కార్యాలయం మరణించిన వారిలో ఇద్దరు డేనియల్ డన్‌బార్ (27), రాండీ టైసన్ (25) అని గుర్తించింది. వారి శవపరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కాల్పుల ఘటన మీద స్థానిక రాపర్ MoneySign $uede పార్టీలో ప్రదర్శన ఇచ్చాడు. ఒక Instagram పోస్ట్‌లో తన సంతాపాన్ని తెలియజేశాడు. కాల్పుల ఘటన మీద స్పందన కోసం అతనికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఇంటికి వెళుతున్నట్లు పేర్కొన్నాడు.

"గత రాత్రి గాయపడిన, మరణించిన వారందరి గురించి ప్రార్థిస్తున్నాను" అని రాపర్ ఇన్ స్టా పోస్టులో రాశాడు. ఆండ్రీ ప్రెస్టన్ లాస్ ఏంజెల్స్ టైమ్స్‌తో మాట్లాడుతూ, అతని సోదరుడు బ్రాండన్ కాస్ట్రో, 18, తుపాకీ గాయాల కారణంగా ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. "నా తమ్ముడు రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు" అని ఓ వార్తాపత్రికతో చెప్పాడు.

చికాగో నైట్ క్లబ్ లో కాల్పులు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు...

కాగా, చికాగోలో మరో షాకింగ్ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఇండియానా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చికాగోకు ఆగ్నేయంగా ఉన్న గ్యారీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిమీద వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఇద్దరు కాల్పుల్లో గాయపడి పడిపోయి కనిపించారు. వారిలో కదలికలేదని పోలీసులు తెలిపారు. 

ప్లేయోస్ నైట్‌క్లబ్ ప్రవేశ ద్వారం దగ్గర 34 ఏళ్ల వ్యక్తి, లోపల 26 ఏళ్ల మహిళ అచేతనంగా కనిపించారని పోలీసులు తెలిపారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ కాల్పుల ఘటనలో మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పుల బాధితుల పేర్లను, వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించాల్సిన అవసరం ఉన్నందున, పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నందున బహుళ చట్ట అమలు సంస్థలు స్పందించాయని వారు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే