చికాగో నైట్ క్లబ్ లో కాల్పులు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు...

Published : Jun 13, 2022, 08:26 AM ISTUpdated : Jun 13, 2022, 08:27 AM IST
చికాగో నైట్ క్లబ్ లో కాల్పులు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు...

సారాంశం

ఆదివారం తెల్లవారుజామున ఇండియానా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 

చికాగో : చికాగోలో మరో షాకింగ్ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఇండియానా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చికాగోకు ఆగ్నేయంగా ఉన్న గ్యారీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిమీద వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఇద్దరు కాల్పుల్లో గాయపడి పడిపోయి కనిపించారు. వారిలో కదలికలేదని పోలీసులు తెలిపారు. 

ప్లేయోస్ నైట్‌క్లబ్ ప్రవేశ ద్వారం దగ్గర 34 ఏళ్ల వ్యక్తి, లోపల 26 ఏళ్ల మహిళ అచేతనంగా కనిపించారని పోలీసులు తెలిపారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ కాల్పుల ఘటనలో మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పుల బాధితుల పేర్లను, వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు. 

Mexico: సెంట్రల్ మెక్సికోలో కాల్పులు.. ఐదుగురు విద్యార్థుల మృతి

ఇదిలా ఉండగా, జూన్ 6న ఫిలడెల్ఫియాలోని ప్రముఖ entertainment districtలో జూన్ 6 అర్థరాత్రి కొంతమంది షూటర్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, కనీసం 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటలకు సెంట్రల్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో పోలీసు అధికారులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, వారికి బుల్లుట్ శబ్దాలు వినిపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు నడకదారిలో, వీధిలో అనేకమంది తుపాకీ గాయాలతో కనిపించారు. వెంటనే పోలీసులు సహాయ చర్యలు చేపట్టారని పోలీసు కమిషనర్ డేనియల్ అవుట్లా చెప్పారు.

ఇక మరొక అధికారి మాట్లాడుతూ వీధి చివర్లో ఒక వ్యక్తి కాస్త దూరంలో ఉన్న పెద్ద గుంపుపైకి తుపాకీతో కాల్చడం చూశానన్నారు. వెంటనే తానూ తన ఆయుధంతో అతనిమీద అనేకసార్లు కాల్పులు జరిపానని.. దీంతో అతను తుపాకీ అక్కడ పడవేసి పారిపోయాడని.. అయితే పారిపోయేముందు అతను గాయపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు మృతుల్లో ఒకరు 34 ఏళ్ల గ్రెగొరీ జాక్సన్, ఇంకొకరు 27 ఏళ్ల అలెక్సిస్ క్విన్ గా గుర్తించారు. మూడో వ్యక్తి 22 ఏళ్ల అతడిని గుర్తించలేదు. మరణించిన ముగ్గురిలో ఒకరు మరొకరితో ఘర్షణకు దిగారని అనుమానిస్తున్నారు. 

ఆ ఇద్దరే ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం ప్రారంభించారని తెలుస్తోంది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో, గాయపడిన వారిలో 17 నుండి 69 సంవత్సరాల వయస్సుగల వారు ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన ఘర్షణలు అమాయకులు ప్రాణాలు విడిచారు.ఇది డార్క్ డే అని.. అస్సలు ఊహించని, భయంకరమైన చర్య అని పోలీసులు అంటున్నారు. ఘటనాస్థలినుంచి రెండు హ్యాండ్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒకటి ఎక్స్ టెండెడ్ మ్యాగజైన్‌తో ఉంది. అయితే చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఫ్రాంక్ వానోర్ మాట్లాడుతూ, మొత్తం ఐదు తుపాకులు ఈ క్రైంలో వాడినట్లు సంఘటనా స్థలంలో సాక్ష్యాల ద్వారా తెలుస్తుందన్నారు. అంతకుముందు జరిగిన కాల్పుల ఘటనలకు వీటికి సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే