బస్సులో మంటలు..26మంది సజీవదహనం

Published : Mar 23, 2019, 08:51 AM IST
బస్సులో మంటలు..26మంది సజీవదహనం

సారాంశం

టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగి.. 26మంది సజీవదహనమైన సంఘటన చైనాలో చోటుచేసుకుంది. 

టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగి.. 26మంది సజీవదహనమైన సంఘటన చైనాలో చోటుచేసుకుంది. 26మంది ప్రాణాలు కోల్పోగా మరో 28మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డే పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 56 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 53 మంది ప్రయాణికులు కాగా.. ఇద్దరు డ్రైవర్లు, ఓ టూరిస్ట్‌ గైడ్‌ ఉన్నారు. బస్సులో ఉన్న వస్తువులు మంటలు అంటుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే