ఆఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 24 మంది మృతి

Siva Kodati |  
Published : Sep 17, 2019, 07:36 PM ISTUpdated : Sep 17, 2019, 07:59 PM IST
ఆఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 24 మంది మృతి

సారాంశం

ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 24 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ఆఫ్గాన్ ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 24 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరీకార్‌లో మంగళవారం ఆఫ్గన్ ప్రధాని అష్రఫ్ ఘనీ ప్రచారం నిర్వహించారు.

ఈ సమయంలో ఉగ్రవాదులు ప్రచార కార్యక్రమం ప్రధాన ద్వారం వద్ద పేలుడు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రధాని ప్రచార ర్యాలీలో మరో బాంబు పేల్చారు.

ఈ సమయంలో ఘనీ అక్కడే ఉన్నారు.. అయితే ఆయన ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకోగా.. 24 మంది పౌరులు మరణించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజధాని కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది.

గ్రీన్ జోన్‌గా పిలిచే ఈ ప్రాంతంలోనే రక్షణ మంత్రిత్వశాఖ, అమెరికా రాయబార కార్యాలయం, నాటో కార్యాలయం వంటివి ఉన్నాయి. కాగా ఆఫ్గాన్ ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే