Ukraine Russia Crisis మైకోలైవ్ పోర్టులో చిక్కుకున్న 21 మంది భారతీయులు

Published : Mar 06, 2022, 11:16 AM ISTUpdated : Mar 06, 2022, 11:20 AM IST
Ukraine Russia Crisis మైకోలైవ్ పోర్టులో చిక్కుకున్న 21 మంది భారతీయులు

సారాంశం

ఉక్రెయిన్ లోని మైకోలైవ్ పోర్టులో 21 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిని ఇండియాకు రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసకొంటున్నారు.

కీవ్: Ukraine లోని Mykolaiv పోర్టులో 21 మంది భారతీయ నావికులు చిక్కుకున్నారు.  ఓ Shipలో వీరంతా పనిచేస్తున్నారు.. ఉక్రెయిన్ పై Russia మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో  Portలోనే వీరంతా ఉన్నారు. ఓడలో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులతో కూడా కాంటాక్టులో ఉన్నారని  నౌక మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు, సీఈఓ సంజయ్  ప్రషార్ చెప్పారు. ఇదే ఓడరేవులో మరో 24 నౌకలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నౌకల్లో కూడా భారతీయులున్నారని Prashar  వివరించారు.

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో చోటు చేసుకొన్న పరిణామాలను విదేశఈ వ్యవహరాల మంత్రిత్వశాఖ, ఇండియన్ ఎంబసీ పరిశీలిస్తుంది.షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ సహా ఇతర అధికారులతో కేంద్రం నిత్యం సంప్రదింపులు జరుపుతుంది. 

గత నెల 24వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. అయితే ఈ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన నాటి నుండి నౌక నుండి సిబ్బంది ఎవరూ కూడా బయటకు రాలేదు. ఈ నౌకపపై నిఘాను కూడా ఉంచారని ప్రషార్ తెలిపారు. మైకోలైవ్ త ఈ నౌక ఉందన్నారు. భారతీయ నావికులతో పాటు తమ నౌక కూడా సురక్షితంగా ఉందని ప్రషార్ స్పష్టం చేశారు. 

నౌకలో ఇంటర్నెట్ తో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్స్ పనిచేస్తున్నాయన్నారు. నౌకలో ఉన్న సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్న వారంతా వారి కటుంబ సభ్యులతో నిత్యం phone లో టచ్ లో ఉన్నారని ప్రషార్ చెప్పారు.రష్యన్ దళాలు నల్ల సముద్రం తీరం దగ్గరగా ఉన్నందున ఈ పోర్టు పనిచేయడం లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఈ పోర్టును ఖాళీ చేయాల్సి వస్తే పోలాండ్ సరిహద్దు తమకు 900 కి.మీ . దూరంలో ఉంటుందని ప్రషార్ చెప్పారు. లేదా కీవ్ నగరానికి వెళ్లడానికి 500 కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.  అయితే ఈ రెండు ప్రాంతాలను చేరుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చని ప్రషార్ అభిప్రాయపడ్డారు.

తమ కంపెనీ నిరంతరం Indian రాయబార కార్యాలయానికి నివేదికను సమర్పిస్తుందని ప్రషార్ తెలిపారు.  ఇంటర్నేషనల్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫెడరేషన్, నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫేరర్స్ ఆఫ్ ఇండియా సంస్థలు కూడా తమను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నాయని ప్రషార్ చెప్పారు  ఈ విషయమై తాము నిరంతరం ఉక్రెయిన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని డబ్ల్యుటీఎఫ్ సభ్యుడు  NUSI జనరల్ సెక్రటరీ అబ్దుల్గాని సెరాంగ్ చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్ లోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లను  రష్యా ఆక్రమించుకొంది..  మూడో అణు విద్యుత్ ప్లాంట్ ను యుజ్నౌ‌క్రైన్స్  న్యూక్లియర్ పవర్ ప్లాంట్  పై రష్యా కన్ను పడింది. ఈ ప్లాంట్  ను కూడా రష్యా ఆక్రమించుకొనే ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ అనుమానిస్తుంది.

 మైకోలైవ్ కు ఉత్తరాన 120 కి.మీ దూరంలో ఈ అణు విద్యుత్ ప్లాంట్ ఉంది.బెలారస్ సరిహద్దులో జరిగిన రష్యా  ఉక్రెయిన్ మధ్య మొదటి రెండు రౌండ్ల చర్చల వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం  దక్కలేదు.   మూడో దఫా చర్చలు  సోమవారం నాడు జరగనున్నాయి.  యుద్ద ప్ర‌భావం ర‌ష్యాకు  అర్థ‌మ‌యింద‌ని ఉక్రెయిన్ అభిప్రాయపడింది. తమప్రతిఘటన, అంతర్జాతీయ ఆంక్షల పట్ల ర‌ష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించిందనే అభిప్రాయాన్ని ఉక్రెయిన్ అభిప్రాయపడింది.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి