ఈజిప్టులో గార్మెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం: 20 మంది మృతి, 24 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Mar 12, 2021, 10:25 AM IST
Highlights

ఈజిప్టులో గురువారం నాడు జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కైరో:ఈజిప్టులో గురువారం నాడు జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈజిప్టు రాజధాని నార్త్ కైరో లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మరణించారని అధికారులు ప్రకటించారు.నార్త్ కైరోలోని ఎల్ ఓబోర్ సిటీలోని నాలుగు అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించాయి. గురువారం నాడు ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  12 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి.2020 లో కైరో హైవేలో ఆయిల్ పైపులైన్ లీకై మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో సుమారు 17 మంది మరణించారు. 

అగ్ని ప్రమాదానికి గల  కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంబవించకుండా చర్యలు తీసుకొన్నారా అనే కోణంలో కూడ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు.
 

click me!