టర్కీలో భూకంపం.. 35సార్లు కంపించిన భూమి, 18 మంది మృతి!

By Prashanth MFirst Published Jan 25, 2020, 10:17 AM IST
Highlights

టర్కీ దేశాన్ని భయంకర భూకంపం ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. బిజీ బిజీ నగరాల్లో జనాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో ఆ దేశంలో భూకంప తీవ్రత పెరుగుతోంది.

టర్కీ దేశాన్ని భయంకర భూకంపం ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. బిజీ బిజీ నగరాల్లో జనాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో ఆ దేశంలో భూకంప తీవ్రత పెరుగుతోంది. ఇప్పుడు వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదైంది. ఈ ప్రమాదంలో 550 మంది గాయపడగా 18 మందికి పైగా మృతి చెందారు.

గాజియన్టెప్ సిటీకి తూర్పు సమీపంలో 218కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించనట్లు యూరోపియన్ మెడిటెరాన్ సిస్మాలాజికల్ కేంద్రం తెలియజేసింది. వెంటనే అక్కడు ప్రభుత్వం జనాలను ఆదుకునేందుకు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేసింది. ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం ఎక్కువగా జరిగిందని 35 సార్లు భూమి కంపించిందని ఆక్కడి డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు తెలియజేశారు.

బాధితులను ఆదుకునేందుకు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఈర్డాగాన్ తెలిపారు. టర్కీలోని  స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలోకి ధగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనాలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని హెలిక్యాఫ్టర్ల సహాయంతో ఆహారపదార్ధాలను అందించే సహాయం చేస్తున్నారు.

click me!