UAE Attack : హుతీలపై సంకీర్ణ దళాల వైమానిక దాడులు, 11మంది మృతి, పలువురికి గాయాలు..

By SumaBala BukkaFirst Published Jan 19, 2022, 7:07 AM IST
Highlights

ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది మృతి చెందినట్లు సమాచారం.  దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.  సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి లో యూఏఈ కూడా భాగస్వామి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

సనా : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధానిపై తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొద్ది గంటల్లోనే Saudi Arabia సంకీర్ణ దళాలు.. Houthi తిరుగుబాటుదారుల ఆధీనంలోని Yemen రాజధాని సనాపై మంగళవారం వైమానిక దాడులు జరిపాయి. 

ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది మృతి చెందినట్లు సమాచారం.  దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.  సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి లో యూఏఈ కూడా భాగస్వామి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పదకొండు మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది...  అని స్థానికులు  తెలిపినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది. మృతుల సంఖ్యను వైద్య వర్గాలు ధ్రువీకరించాయి.  అబుదాబిపై తామే డ్రోన్,  క్షిపణి దాడులకు పాల్పడినట్లు  హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు గతంలోనూ సౌదీ అరేబియా సరిహద్దుల్లో పదే పదే దాడులకు పాల్పడ్డారు. అయితే సరిహద్దులు దాటి దాడి చేయడం ఇదే మొదటిసారి.  అమెరికా, ఇజ్రాయిల్ తదితర దేశాలు ఈ దాడులను ఖండించాయి. 

కాగా, అబుదాబి airportకు సమీపంలో సోమవారం నాడు జరిగిన drone దాడిలో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు Indians సహా మరొకరు మరణించిన్టుగా అధికారులు తెలిపారు. అబుదాబిలోని ప్రధాన చమురు నిల్వకేంద్రానికి సమీపంలో చమురు ట్యాంకులను డ్రోన్ ద్వారా పేల్చివేయడతో ఇద్దరు భారతీయులు సహా ఒక pakistan వాసి మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్టుగా స్థానిక మీడియా తెలిపింది.    ఈ దాడికి తామే బాధ్యులమని houthi ప్రకటించింది.

అంతకుముందు Abu Dhabi నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన డిపోల సమీపంలో మూడు ఇంధన ట్యాంకులు పేలినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. హౌతీ సైనిక ప్రతినిధి యుహ్యా సారీ మీడియాతో మాట్లాడారు. UAE భూభాగంలో సైనిక ఆపరేషన్ ను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. హౌతీలు యూఏఈ నౌకను స్వాధీనం చేసుకొన్న కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకొంది. నౌకను, నౌకలోని సిబ్బందిని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది.

2019 సెప్టెంబర్ 14న Saudi Arabia లోని రెండు కీలక చమురు స్థావరాలను యెమెన్ కు చెందిన Houthi తిరుగుబాటు దారులు దాడులు చేశారు.  ఈ దాడుల వల్లే పర్షియన్ గల్ప్ లో ఉద్రిక్తతలు పెరిగాయి.Drone దాడితో మూడు Fuel  Tankerలో మంటలు వ్యాపించాయి. అంతేకాదు UAE కొత్త విమానాశ్రయంలో మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు తెలిపారు. ముసఫా ప్రాంతంలోని మూడు ఇంధన ట్యాంకర్లు పేలిపోయాయని పోలీసులు వివరించారు.  

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో  అగ్ని ప్రమాదానికి కారణమయ్యే డ్రోన్  గా ఉండే చిన్న విమానం భాగాలు సీజ్ చేశామని  పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైదర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. యూఏఈ మద్దతున్న సంకీర్ణ అనుకూల దళాలు  యెమెన్ లోని షాబ్వా, మారిబ్ లలో హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
 

click me!