హిందు-ముస్లిం ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. బ్రిటిష్ గుండెల్లో వ‌ణుకుపుట్టించిన భార‌త స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు

By Mahesh Rajamoni  |  First Published Aug 6, 2022, 3:36 PM IST

Indian Freedom Fighter: బ్రిటిష్ పాలకులు భారత్ లోని వివిధ వర్గాలను విభజించి పాలన సాగిస్తూ.. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేసే ప్రయత్నాలు చాలానే చేశారు. అయితే, హిందూ-ముస్లిం ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ బ్రిటిష్ గుండెల్లో వ‌ణుకుపుట్టించిన భార‌త స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు అనేక మంది ఉన్నారు. 


Azadi Ka Amrit Mahotsav: దేశ విభ‌జ‌న త‌ర్వాతి నుంచి భార‌త్ లో హిందూ-ముస్లింల మ‌ధ్య కొన్ని విభ‌జ‌న రేఖ‌లు అంత‌రాల‌ను పెంచుతూనే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాలు మ‌రింత‌గా పెరిగాయి. ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీశాయి. అయోధ్య నేడు హిందువులు-ముస్లింల మధ్య తీవ్రమైన ఉద్రిక్త‌త‌కు దారితీసిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కానీ భార‌త స్వాతంత్య్ర పోరాటంలో హిందూ-ముస్లింల‌తో పాటు అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు క‌లిసిక‌ట్టుగా పోరాడారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. అయోధ్యలో ఈ రెండు వర్గాలు చేతులు కలిపి ఆంగ్లేయులతో  పోరాడారు. బ్రిటిష్ గుండెల్లో వణుకును పుట్టించారు. ప్రజలను విభజించి పాలించు అనే బ్రిటిష్ ప్రయత్నాలను కూలగొట్టారు. వలస పాలకులను నిద్రలేకుండా చేశారు. ఎంతోమంది భారతీయులకు ఆదర్శంగా నిలుస్తూ.. హిందూ ముస్లిం ఐక్యతను ప్రదర్శిస్తూ.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. భారతజాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తమ (Indian Freedom Fighter) ప్రాణాలు అర్పించారు. 

1857లో భారతదేశ మొదటి స్వాతంత్య్ర పోరాటానికి బలం హిందూ-ముస్లింల‌ ఐక్యత. అయోధ్యలో ఈ సోదరభావం వెల్లువిరిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.  ఆ ఇద్దరు పూజారులు- అయోధ్య మౌల్వీ అమీర్ అలీ, ప్రసిద్ధ హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి బాబా రామ్ చరణ్ దాస్ల మైత్రీతో.. వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వారి ఆధ్వర్యంలో ఏర్పడిన దళంతో 1857లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేత‌బ‌ట్టి పోరాటాన్ని ముందుకు నడిపించారు. చివ‌రికి వారిద్దరినీ బంధించి, అయోధ్యలోని ఫైజాబాద్ జైలులో ఉన్న కుబేర్ తేలా వద్ద చింతచెట్టుకు ఉరితీసి చంపారు. భారత స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం వారు సాగించిన పోరాటం ఇప్పటికీ భారత హిందూ-ముస్లి ప్రజల్లో స్పూర్తిని నింపుతుంది. 

Latest Videos

undefined

అలాగే, అయోధ్యలో ఆంగ్లేయులకు వ్య‌తిరేకంగా క‌లిసి పోరాటం సాగించిన హిందూ-ముస్లి వ‌ర్గాల‌కు చెందిన మరో ఇద్దరు ప్రముఖ నాయకులు ఫైజాబాద్ రాజు దేవి బక్ష్ సింగ్ కు చెందిన కమాండర్లు అకాన్ ఖాన్, శంభు ప్రసాద్ సుక్లా. ఖాన్- శుక్లా ఇద్దరూ 1857లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విజయవంతమైన ప్ర‌చార హోరుకు నాయ‌క‌త్వం వ‌హించారు. ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టారు. దీనిని గుర్తించిన బ్రిటిష్ అధికారులు వారిని అంతం చేయడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. ఈ క్ర‌మంలోనే ఆంగ్లేయులు వీరిద్ద‌రిని బంధించి ఉరితీశారు. 

ఇలా భార‌త మొద‌టి స్వాతంత్య్ర ఉద్య‌మం 1857గా పేరుగాంచిన స‌మ‌యంలో చోటుచేసుకున్న ప‌లు ఘ‌ట‌న‌లు హిందూ-ముస్లింల మ‌ధ్య ఉన్న చారిత్రాత్మక సంఘీభావం 1857 నాటి స్ఫూర్తి. ఇలా హిందూ-ముస్లిం వ‌ర్గాల‌కు చెందిన పోరాట స్ఫూర్తిని నింపిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో నానా సాహెబ్మ్ బహదూర్ షా సఫర్, రాణి లక్ష్మీ బాయి, అహ్మద్ షా మౌల్వీ, తంతియా తోపే, ఖాన్ బహదూర్ ఖాన్, హజ్రత్ మహల్, అజీముల్లా ఖాన్ వంటి అనేక మంది ఉన్నారు. భారత పోరాటంలో వారు ప్రత్యేక చరిత్రను లిఖించారు.

click me!