RTC Strike:ఓయూ విద్యార్థి సంఘాల మద్దతు...భారీ సభకు ఏర్పాట్లు

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 8:26 PM IST
Highlights

ఆర్టీసి ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు మరింత మద్దతు పెరిగింది. ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా సిద్దమయ్యారు.  

తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ కార్మికులు చేపడుతున్న ఆర్టిసి సమ్మెకు  రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించగా తాజాగా విద్యార్థి సంఘాల మద్దతును ప్రకటిస్తున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ ఓయూకు చెందిన వివిధ విద్యార్థి సంఘాలు ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచాయి. 

ఈ నెల 24వ తేదీన ఆర్టిసి ఉద్యోగులకు సంఘీభావంగా యూనివర్సిటీ ప్రాంగణంలో భారీ బహిరంగ నిర్వహించనున్నట్లు ఓయూ నిరుద్యోగ ప్రంట్,  బిసి విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో ఈ సభను నిర్వహించనున్నట్లు ఈ సంఘాలు ప్రకటించాయి. ఆర్టిసి ఉద్యోగులకు మద్దతివ్వాలనుకునే వారు మాతో కలిసి పనిచేస్తూ సభ  నిర్వహణకు సహకరించాలని కోరారు. 

తమతో కలిసివస్తామంటే ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకుపోతామని ఈ రెండు సంఘాల నాయకులు తెలిపారు. ఈ  సభ ద్వారా ఆర్టీసి కార్మికులు వాయిస్  ప్రభుత్వానికి వినబడేలా చేస్తామని తెలిపారు. 

సునీల్ శర్మ భేటీ: RTC కార్మికుల సమ్మెపై తమిళిసై రియాక్షన్ ఇదీ...

ఇటీవలే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగ సంఘం మద్ధతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులతో కలిసి తాము కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆ
రవీందర్ రెడ్డి వెల్లడించారు. గత సోమవారమే టీఎన్జీవో నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే టీఎన్జీవోల మద్దతు లభించింది. 

కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని... చర్చలు జరిపితే మిగతా ఉద్యోగ వర్గాలకు పరిష్కారం దొరుకుతుందని రవీందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకుందామని.. కార్మికుల పక్షాన ఉద్యోగ సంఘాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

 

click me!