బాలికపై క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారం: ఉమేష్ అరెస్టు

Published : Jun 25, 2020, 06:31 PM ISTUpdated : Jun 25, 2020, 06:32 PM IST
బాలికపై క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారం: ఉమేష్ అరెస్టు

సారాంశం

రక్షణగా ఉండాల్సినవాడే భక్షించాడు. రామ్ గోపాల్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉమేష్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఉమేష్ ను బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు. కాపాడాల్సిన కానిస్టేబుల్ ఓ బాలికను కాటేశాడు. ఓ బాలికపై క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. ఉమేష్ అనే క్రైమ్ కానిస్టేబుల్ ఈ దురాగతానికి ఒడిగట్టాడు. 

లాక్ డౌన్ కారణంగా బాలిక ఇంట్లో ఉంటూ వచ్చింది. ఆమె నివాసం ఉంటున్న ఇంటి పక్కనే క్రైమ్ కానిస్టేబుల్ ఉమేష్ నివాసం ఉంటున్నాడు. అతను రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బాలికపై ఉమేష్ అత్యాచారం చేశాడు. 

ఆ సంఘటన సికింద్రాబాదులోని బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!