ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం... నివాళులు అర్పించిన కేటీఆర్, హరీష్

Arun Kumar P   | Asianet News
Published : Feb 08, 2020, 04:41 PM IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం... నివాళులు అర్పించిన కేటీఆర్, హరీష్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట ఇవాళ విషాదం చోటుచేసుకుంది. 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు స్వయానా బావ అయిన పర్వతనేని రాజేశ్వర్ రావు(84) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈయన కేసీఆర్ రెండో సోదరి భర్త. 

రాజేశ్వర్‌రావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్ల గ్రామం. అయితే ఆయన కుటుంబంతో కలిసి ఆల్వాల్ లోని మంగాపురికి నివాసముంటేవారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

ఈ వార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆల్వాల్ లోని ఆయన స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోదరితో పాటు  వారి పిల్లలను ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు కూడా ఉదయమే మంగాపురికి చేరుకుని రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...