నల్లగా ఉందని భార్యను చంపేసి గొంతు కోసుకున్న భర్త

Published : Aug 18, 2020, 06:10 PM ISTUpdated : Aug 18, 2020, 06:12 PM IST
నల్లగా ఉందని భార్యను చంపేసి గొంతు కోసుకున్న భర్త

సారాంశం

తెలంగాణ రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. యోగి అనే వ్యక్తి తన భార్య అరుణను హత్య చేసి తాను గొంతు కోసుకున్నాడు. ఆరు నెలల క్రితమే వారికి పెళ్లయింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని మియాపూర్ లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. నల్లగా ఉందనే కారణంతో యోగి అనే వ్యక్తి తన భార్యను చంపి, తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

యోగికి ఆరు నెలల క్రితమే మేనకోడలు అరుణతో వివాహమైంది. 20 రోజుల క్రితం భార్యను కాపురానికి తీసుకుని వచ్చాడు. అయితే ఆమె నల్లగా ఉందనే కారణంతో దారుణానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదని అతను మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

వివరాలు అందాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Tour Guide : వరుసగా మూడ్రోజుల సెలవులు... కేవలం 3 వేలకే 1 నైట్, 2 డేస్ టూర్, ప్లాన్ రెడీ
Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం