పంచాయితీ కార్యదర్శి నియామకాల్లో అవకతవకలు... అభ్యర్థుల్లో అనుమానం

By Arun Kumar P  |  First Published Dec 19, 2018, 6:09 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నెలకొంది. ఆ పోస్టులకు పరీక్షలు  నిర్వహించి ... ఫలితాలు వెల్లడించకుండానే నియామక ప్రక్రియ చేపట్టడం గందరగోళానికి కారణమయ్యింది. కేవలం ఎంపికైన అభ్యర్ధుల లిస్టును మాత్రమే ప్రకటించడం మిగతా అభ్యర్ధుల ఆగ్రహానికి కారణమవుతోంది. దీంతో ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న యువత ఆందోళన బాట పట్టారు. 

ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ, పరీక్షల వరకు అంతా బాగానే జరిగిన నియామక ప్రక్రియలో ఒక్కసారికి మార్పులు చోటుచేసుకున్నాయి. ఏదైనా పోటీ పరీక్ష జరిగిన తర్వాత మొదట ప్రశ్నాపత్రానికి సంబంధించిన కీ విడుదల చేసి ఆ తర్వాత పలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉద్యోగాల భర్తీ చేపడుతారు. కానీ ఈ పంచాయితీ కార్యదర్శి నియామకాల్లో ఈ నిబంధనలేవీ పాటించలేదు.

Latest Videos

undefined

 పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలకు సంబంధించిన తుది కీ గాని, ఫలితాలు కానీ వెల్లడించకుండానే నేరుగా ఎంపికైన అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. అదికూడా వివిధ జిల్లాల కలెక్టర్లు వేరువేరుగా ప్రకటించారు. ఇలా ఏ విధంగా చూసినా ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగడం లేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడటంతో మిగతా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ ఉద్యోగాలవైపు మళ్లారని...ఇప్పుడు ఇలా అవకతవకలు జరగడంతో ఎటూ కాకుండా పోతున్నామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

ఈ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ నిరుద్యోగులు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు పంచాయితీరాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్ విముఖత వ్యక్తం చేశారు.  

click me!