ఆ ఉద్యోగాలు మొత్తం పురుషులకే...ఎందుకంటే: రైల్వే బోర్డు

By Arun Kumar PFirst Published Jan 11, 2019, 2:26 PM IST
Highlights

రైల్వే ఉద్యోగాలకు సంబంధించి రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖలో కొన్ని కఠినతరమైన, భద్రతాపరంగా రక్షణ లేని ఉద్యోగాలను మహిళలకు కేటాయించవద్దని రైల్వే బోర్డు ఉద్యోగ నియామకాలను చేపట్టే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి సూచించింది. అలా గుర్తించిన కొన్ని ఉద్యోగాలను కూడా రైల్వే బోర్డు గుర్తించింది.  

 ఒంటరిగా పనిచేయాల్సి వచ్చే ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవద్దని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా లోకో పైలట్లు, రైల్వే గార్డులు, పోర్టర్లు, ట్రాక్ మెన్ వంటి ఉద్యోగాలను మహిళలకు కేటాయించావద్దని సూచించారు. ఇప్పటికే ఈ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలను కూడా వేరే విభాగాల్లోకి మార్చడం కానీ...భద్రతా పరమైన సౌకర్యాలు కానీ కల్పించాలని బోర్డు సంబంధిత అధికారులకు సూచించింది. 

రైల్వేలోని అన్ని విభాగాల్లో తమకు అవకాశం కల్పించాలని...లింగవివక్ష చూపించరాదని మహిళలు కోరుతున్నారు. ప్రస్తుతం రైల్వేలో కేవలం 2 నుంచి 3 శాతమే మహిళా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను పెంచడానికి ఇప్పటిలా కేవలం డెస్క్ ఉద్యోగాలకే మహిళల్ని పరిమితం చేయకుండా అన్ని రకాల ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని మహిళలు కోరుతున్నారు. దీనిపై స్పందించిన రైల్వే బోర్డు ఉ ఉద్యోగాలనయినా మహిళలకు కేటాయిస్తామని...కానీ తాము పేర్కోన్న వాటిలో మాత్రం అవకాశం ఇవ్వమంటూ స్పష్టం చేసింది. 

చాలా కఠినమైనవని,  భద్రత దృష్ట్యా మహిళలను నియమించలేని ఉద్యోగాల్లో కేవలం పురుషులకే అవకాశం కల్పించనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. మిగతా ఉద్యోగాల్లో మహిళలకు సమున్నత స్థానం కల్పింస్తామని  హామీ ఇచ్చింది. 
 
అయితే భద్రత సాకుతో మహిళల ఉద్యోగావకాశాలను దెబ్బతీసేలా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుందని కొన్ని ఉద్యోగ యూనియన్లు పేర్కొన్నాయి. మౌళిక సదుపాయాలు, భద్రత కల్పిస్తే ఎలాంటి  ఉద్యోగాన్నయినా మహిళలు నిర్వర్తిస్తారని యూనియన్ సభ్యులు తెలిపారు.  

click me!