Rakul Preet:తెలుగులో ఒక్క సినిమా లేదు...అదే కొంప ముంచింది

By Surya Prakash  |  First Published Aug 2, 2022, 7:06 AM IST

బొద్దుగా ఉన్న ర‌కుల్ ప్ర‌స్తుతం స‌న్న‌జాజి తీగ‌లా త‌యారైంది.  రకుల్ సోషల్ మీడియాలోu కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ అందాలను ఇన్ స్టా అకౌంట్ లో ఆర‌బోస్తూ అందాల ట్రీట్ ఇస్తోంది. అయినా ఆమెకు ఆఫర్స్ రావటం లేదు.


ఇండస్ట్రీకి పరిచయమై, నిలదొక్కుకని స్టార్ హీరోయిన్ గా ఎదగటం అంటే మాటలు కాదు.  ర‌కుల్ ప్రీత్ సింగ్  ఆ విషయంలో హై సక్సెస్. అతి తక్కువ కాలంలోనే ఎదిగి తనేంటో చూపించింది. తన టాలెంట్ తో దూసుకుపోయింది. తెలుగుతోపాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించి హిట్స్ అందుకుంది. 

 ఆ మధ్యన  కొండ‌పొలం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో  కనపడింది లేదు. త‌న ఫిట్ నెస్ తో అందరి మ‌తిపోగొట్టే ఈమెకు ఎందుకు ఆఫర్స్ రావటం లేదు. బొద్దుగా ఉన్న ర‌కుల్ ప్ర‌స్తుతం స‌న్న‌జాజి తీగ‌లా త‌యారైంది. అలాగే త‌న బాడీలోని ఓ పార్ట్ కి స‌ర్జ‌రి కూడా చేసుకుందంట‌.ఇక రకుల్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ అందాలను ఇన్ స్టా అకౌంట్ లో ఆర‌బోస్తూ అందాల ట్రీట్ ఇస్తోంది.అందుకు కారణం ...బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టటమే అంటున్నారు..ఎంత వరకూ నిజం..అసలు తెలుగులో ఆమెకు ఆఫర్స్  లేకపోవటానికి కారణం ఏమిటి?

Latest Videos

రకుల్ కు తెలుగు నుంచి  అవకాశాలు కాదు కదా రకుల్ ని సంప్రదించడమే మర్చిపోయారు తెలుగు నిర్మాతలు. దీనికి కారణం.. ఇటివలే తన రిలేషన్ షిప్ ని ఓపెన్ గా ప్రకటించటమే కారణం అంటున్నారు. జాకీ భగ్నానీతో ప్రేమలో వున్నట్లు మనసులో వున్న మాట చెప్పేయటంతో ఆమెకు క్రేజ్ ఇక యూత్ లో ఉండదని నిర్మాతలు భావిస్తున్నారట. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సిస్టర్స్, బ్రదర్స్ , ప్రెండ్స్ ఎలా ఉంటారో… అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని, నా జీవితంలో ఆ ప్రత్యేకమైన వ్యక్తి భగ్నానీ అంటూ ఓపెన్ అయ్యింది.
 
ప్రేమ వ్యవహారం  కాస్తంత గుట్టుగా ఉంచాలంటున్నారు. ఇలాంటివి స్టార్ సెలబ్రేటీలకు మాత్రం కెరీర్ పై ప్రభావం చూపిస్తాయి. నిర్మాతలు .. రకుల్ ఆప్షన్ ని తీసేయడానికి కారణం జాకీ భగ్నానీతో అనుబంధమేనని అంటున్నారు. ఆమె కొంతకాలం ఆ విషయం దాచి ఉంచాల్సిందేమో అని చెప్తున్నారు. అదే కొంప ముంచిందని చెప్తున్నారు.  

అయితే అదొక్కటే కారణం కాకపోవచ్చు. ఆమె చేసిన సినిమాలు వరస ఫెయిల్యూర్స్ అవటం కూడా మరో కారణం అని చెప్తున్నారు. మహేష్ తో చేసిన 'స్పైడర్' సినిమా రకుల్ ప్రీత్ కెరీర్ ని తలకిందులు చేసేసిందనే చెప్పాలి. ఈ సినిమా రిజల్ట్ తో టాప్ లీగ్ లో వున్న రకుల్ ఒక్కసారిగా కిందకుపడిపోయింది. స్టార్ హీరోల సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయింది. ఆ  తర్వాత నాగార్జున లాంటి సీనియర్ హీరోతో చేసిన మన్మధుడు 2 కూడా దారుణంగా ఫెయిలైంది. దీని తర్వాత బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తే..అవి  కూడా కలసి రాలేదు. కొంత గ్యాప్ తర్వాత కొండపోలంలో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాఫే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆమె కెరీర్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలే.  

click me!