pawan kalyan : పవన్ చిత్రం రీమేక్ లో వెంకీ.. షాకింగ్ న్యూస్ ?

Surya Prakash   | Asianet News
Published : Apr 20, 2022, 08:52 AM IST
pawan kalyan : పవన్ చిత్రం రీమేక్ లో వెంకీ.. షాకింగ్ న్యూస్ ?

సారాంశం

ఇప్పుడు దేశం మొత్తం సౌత్ ఇండియా స్టార్స్ వైపు చూస్తోంది. ఇక్కడ కథలు, డైరక్టర్స్ అంటే ఉత్సాహం చూపిస్తోంది. ఈ క్రమంలోనే వారికి బాలీవుడ్ నుంచి పిలుపులు వస్తున్నాయి. మనవాళ్లు పాన్ ఇండియా మూవీస్ తో దుమ్మురేపటం సీనియర్ హీరోలకు సైతం కలిసి వస్తోంది.  


ఆ మధ్యన పవన్ కళ్యాణ్ హీరోగా `కాటమరాయుడు` అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం   2014 నాటి  తమిళ సూపర్ హిట్ `వీరమ్` కు అఫీషియల్ రీమేక్ . ఇప్పుడీ చిత్రం హిందీలోకి రీమేక్ అవుతోంది.  ఈ చిత్రానికి భాయ్‌జాన్‌ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.   ఈ సినిమాలోనే సల్మాన్, వెంకీ కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం.  బాలీవుడ్ ఆడియెన్స్ కోసం కథలో మార్పులు చేర్పులు చేశారు. సల్మాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుంది. 

వెంకీ కోసం సౌత్ నుంచి మరో హీరోయిన్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. అయితే వెంకటేష్ కు ఈ కథలో చేసే పాత్ర ఏమిటనన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే హీరోయిన్ అన్నయ్య అని తెలుస్తోంది. తెలుగులో హీరోయిన్ తండ్రి పాత్రను ..హిందీలో హీరోయిన్ కు అన్నగా మార్చారంటున్నారు. దాంతో సల్మాన్ కు, వెంకీకు మధ్య సీన్స్ ఉండబోతున్నాయట.

ఇప్పుడు దేశం మొత్తం సౌత్ ఇండియా స్టార్స్ వైపు చూస్తోంది. ఇక్కడ కథలు, డైరక్టర్స్ అంటే ఉత్సాహం చూపిస్తోంది. ఈ క్రమంలోనే వారికి బాలీవుడ్ నుంచి పిలుపులు వస్తున్నాయి. మనవాళ్లు పాన్ ఇండియా మూవీస్ తో దుమ్మురేపటం సీనియర్ హీరోలకు సైతం కలిసి వస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోలు  కూడా తిరిగి బీటౌన్ పయనమవుతున్నారు. ఇప్పటికే చిరు సైరాతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. నాగార్జున బ్రహ్మాస్త్రాలో నటిస్తున్నాడు. ఇప్పుడు వెంకీ వంతు వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలసి మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు విక్టరీ.

వాస్తవానికి సీనియర్ నటుడు వెంకటేష్ బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితం ‘అనారి’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినా బాలీవుడ్‌లో కెరీర్‌ని కొనసాగించలేదు. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉండే ఈ   నటుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ఒక హిందీ చిత్రంలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాలలో ఒకదానిలో కీలక పాత్ర పోషించడానికి వెంకటేష్‌ను సంప్రదించాడని మరియు దగ్గుబాటి స్టార్ వెంటనే ఓకే చెప్పారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?