Salaar: మొన్న ‘క్రాక్’లో ఇప్పుడు ‘సలార్‌’లో శృతి హాసన్ క్యారక్టర్ ట్విస్ట్

By Surya Prakash  |  First Published Jan 18, 2022, 9:29 AM IST

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ నేపధ్యంలో శృతి హాసన్ పాత్ర ఏమిటి...ఆమె పాత్రకు ఉన్న ట్విస్ట్ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ విడుదల చివరి నిముషంలో వాయిదా పడింది. ఇప్పటికే బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేదానిమీదే పూర్తి దృష్ఠిపెట్టారు ప్రభాస్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్టు సమాచారం. మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్ కోవిడ్ కంట్రోల్ లోకి వచ్చాక మొదలెడతారని వార్తలు వస్తున్నాయి.

 ‘సలార్‌’ని త్వరగా పూర్తి చేసి, ‘ప్రాజెక్ట్ k’పై దృష్ఠి సారించాలని ఇప్పుడు ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారట. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సలార్’లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ నేపధ్యంలో శృతి హాసన్ పాత్ర ఏమిటి...ఆమె పాత్రకు ఉన్న ట్విస్ట్ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.

Latest Videos

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్ లోని యాక్షన్ సీన్లు నెక్ట్స్  లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. అలాగే శృతి హాసన్ జర్నలిస్ట్ గా కనిపించబోతుందిట. ప్రభాస్ తో ప్రేమలో పడుతుందిట. ప్రభాస్, శృతి మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్ గా ఉంటాయని క్లైమాక్స్ లో శృతిహాసన్ పాత్ర చనిపోతుందని సమాచారం అందుతోంది.   ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా శ్రద్ధా కపూర్ ఆ సాంగ్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

 ఆది పురుష్ తో పాటు డార్లింగ్ ఇందులో కూడా సమాంతరంగా పాల్గొంటాడని ఫిలిం నగర్ టాక్. సలార్ ఏ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది కాబట్టి మాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

 

click me!