సలార్‌కు సంబంధించిన మరో వార్త కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్ర టీమ్ నుంచి ఓ బిగ్ అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ (Salaar) అనుకున్న తేదీకి విడుదల కావడం లేదని వార్తలు వస్తున్న నేపధ్యంలో రకరకాల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ‘సలార్’ వాయిదా పడడం పక్కా అయితే ఇప్పటికే USAలో అమ్ముడైన పరిస్దితి ఏమిటనేది మొదట తలెత్తే ప్రశ్న. విదేశాల్లో ‘సలార్’ (Salaar) టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా తెలిపింది.
దీంతో ఈ చిత్రం ఓవర్సీస్లోనూ భారీ విజయం సాధించడం ఖాయం అని అందరూ అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ స్థాయిలో ఏ సినిమా టికెట్స్ కొనుగోలు కాలేదని ఆ సంస్థ వెల్లడించింది. ఈ పోస్ట్‌తో అందరికి ‘సలార్’పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే ఇప్పుడు సలార్ నెక్ట్స్ రిలీజ్ డేట్ ఎప్పుడనే క్లారిటీ లేదు. అక్టోబర్ లో అని కొందరు అంటూంటే అదేం కాదు సంక్రాంతికి అంటున్నారు. అప్పుడు USA బుక్సింగ్స్ కాన్సిల్ చేసి, రిఫెండ్స్ ఇచ్చేస్తారని సమాచారం. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇక సలార్ లో యాక్షన్ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయని నిర్మాతలు గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ (Shruti Haasan) నటించింది. ‘సలార్’ మూవీపై దేశ వ్యాప్తంగా విపరీతమైన బజ్ ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీస్ఫైర్’ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఇప్పటికే ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం అనుకున్న తేదీకి విడుదలైపోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు వాళ్ల ఆశలపై నీల్లు చల్లుతూ.. ఈ సినిమా వాయిదా పడిందనే వార్త వచ్చింది.