ఈ సినిమా ఇండియా కంటే మూడు రోజుల ముందే ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్ కానుంది. దాంతో ఆ ప్రీమియర్ షోకు క్రిటిక్స్‌తో సహా పలువురు ఆడియెన్స్ సినిమా చూసే అవకాశం ఉంది.
సినిమా రిలీజ్ కు ముందు బజ్ క్రియేట్ చేయటానికి ఎర్లీ ప్రీమియర్ షోలు ఉపయోగపడుతున్నాయి. రీసెంట్ గా కొన్ని చిన్న సినిమాలు సైతం ఈ స్ట్రాటజీని అమలు చేసి బజ్ క్రియేట్ చేసి ఓపినింగ్స్ అందుకున్నాయి. రిలీజ్ కు నాలుగైదు రోజులు ముందు ఎంపిక చేసిన టౌన్స్, సిటీలలో ఈ సినిమా షోలు వేసి సక్సెస్ అయ్యారు.అయితే ఆ మ్యాజిక్ ప్రతీసారీ జరుగుతుందా అంటే చెప్పలేం. ఎర్లీ ప్రీమియర్స్ ద్వారా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే అసలకే మోసం వస్తుంది.
ఇక ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. ఈ నేఫధ్యంలో చిత్రం ప్రమోషన్స్ పెంచి ప్రాజెక్టుపై క్రేజ్ క్రియేట్ చేసే పనిలో ఉంది టీమ్. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సక్సెస్ అవటంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 16న విడుదల అవటానికి ముందే ప్రతిష్ఠాత్మక ‘ట్రిబెకా ఫెస్టివల్’లో ప్రదర్శించనున్నారు. న్యూయార్క్ వేదికగా జూన్ 7 నుంచి 18 వరకు జరగనున్న ఆ వేడుకలో ‘ఆదిపురుష్’ను జూన్ 13న ప్రదర్శిస్తారు.
అలాగే జూన్ 13న ఎర్లీ ప్రీమియర్స్ ఇక్కడ ముంబై,హైదరాబాద్ లో కూడా వేయాలని ప్లాన్ చేసారని సమాచారం. అయితే తాజాగా ఆ ఎర్లీ ప్రీమియర్ షోలను కాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ముంబై సినీ వర్గాల సమాచారం. ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్ షోకు క్రిటిక్స్‌తో సహా పలువురు ఆడియెన్స్ సినిమా చూసే అవకాశం ఉంది. దాంతో మూడు రోజుల ముందే ఆదిపురుష్ టాక్ తెలిసిపోతుంది. పాజిటీవ్ టాక్ వస్తే పర్లేదు కానీ, ఏ మాత్రం నెగెటీవ్ టాక్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే కాన్సిల్ చేసారంటున్నారు. అయితే ఎర్లీ ప్రీమియర్స్ కాన్సిలేషన్ మీద కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 3డీ వెర్షన్‌లో ఈ సినిమాని రూపొందించారు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించగా కృతిసనన్ సీతగా నటించారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ కనిపించునున్నారు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.