Pakka Commercial:థియేటర్స్ ఖాళీ, అయినా సేఫే ఎలాగంటే...

By Surya Prakash  |  First Published Jul 7, 2022, 8:57 AM IST

 మంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనుకుని, త‌ను మ‌ళ్లీ ట్రాకులో రావ‌డం తథ్యం అనుకుని చేసిన ఈ సినిమాకు కలెక్షన్స్ సోసోగా ఉండటం నిరాశపరిచే అంశమే. అయితే ఇక్కడా ఉన్నంతలో నిర్మాత మాత్రం సేఫ్ గా బయిటపడ్డాడంటున్నారు.



ఒకప్పుడు భాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెండీ హీరోగా వెలిగిన గోపీచంద్ ప్రస్తుతం డల్ అయ్యారు. ఆయన చేసే రొటీన్ కథలకు జనం పెద్దగా రెస్పాండ్ కావటం లేదు. ఈ నేఫద్యంలో మొన్న శుక్రవారం రిలీజైన పక్కా కమర్షియల్ రిలీజైంది. ఫస్ట్ వీకెండ్ లోనే జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఎంత పబ్లిసిటీ చేసినా ఫలితం లేదు. ఈ  సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింత స్లో  అయ్యింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజు తో పోల్చితే 6వ రోజు మరోసారి 30-35% రేంజ్ లో డ్రాప్స్ కనడింది.

 ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు స్లైట్ గ్రోత్ కనిపించినా అది ఆశించిన మేర అయితే లేదనే చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వ రోజున 25 లక్షల లోపు కలెక్షన్స్  వచ్చినట్లు ట్రేడ్ లో వినపడుతోంది. ఓ మంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనుకుని, త‌ను మ‌ళ్లీ ట్రాకులో రావ‌డం తథ్యం అనుకుని చేసిన ఈ సినిమాకు కలెక్షన్స్ సోసోగా ఉండటం నిరాశపరిచే అంశమే. అయితే ఇక్కడా ఉన్నంతలో నిర్మాత మాత్రం సేఫ్ గా బయిటపడ్డాడంటున్నారు.

Latest Videos

undefined

మీడియా, ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి దాదాపు రూ.35 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. ప‌బ్లిసిటీకి మ‌రో రూ2 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. అంటే రూ.37 కోట్ల‌న్న‌మాట‌. కానీ ఓవరాల్ గా  ఈ సినిమాకి థియేట‌ర్ నుంచి క‌నీసం ఇందులో  పావు వంతు కూడా రావటం లేదని టాక్‌. అయితే  గోపీచంద్ కి హిందీ శాటిలైట్ మార్కెట్ బాగుండటం కలిసి వచ్చే అంశం అంటున్నారు. డిజిటల్‌, ఓటీటీ, శాటిలైట్ నుంచి దాదాపు రూ.30 కోట్లు వ‌చ్చాయని వినికిడి. ఆ విధంగా . నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ వ‌ల్ల‌.. ఈ సినిమా గ‌ట్టెక్కిందని చెప్తున్నారు. లేదంటే నిర్మాత బ‌న్నీ వాస్ ఈ సినిమాతో భారీ నష్టం చూడాల్సి వచ్చేదంటున్నారు.

 సినిమా రిలీజ్ కు ముందే.. నాన్‌థియేట‌రిక‌ల్ రైట్స్ అన్నీ అమ్మేడం ప్లస్ అయ్యిందని చెప్తున్నారు. పైగా మారుతి గ‌త చిత్రాలు భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, ప్ర‌తి రోజూ పండ‌గేల‌కు ఇప్ప‌టికీ మంచి రేటింగులు వ‌స్తుంటాయి. కాబ‌ట్టి... ఈ సినిమానీ శాటిలైట్ సంస్థ‌లు పోటీ ప‌డి కొన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే నిర్మాత సేఫ్ అయినా..... థియేటర్ వైపు నుంచి చూస్తే... ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ కనిపించడం లేదనే చెప్పాలి. మంచి రోజులు వచ్చాయితో ఆ మధ్య ఫ్లాప్ చవిచూసిన మారుతీకి ఇప్పుడీ పక్కా కమర్షియల్ కూడా వర్కవుట్ కానట్లే కనిపిస్తోంది.
  

click me!