'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ కోసం పదునైన కథ సిద్ధం చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేయబోతున్నారు. ఇప్పటికే అనీల్ రావిపూడి తో స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని సమచారం. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే నెక్స్ట్ ఎవరితో అనేది హాట్ టాపిక్ రన్ అవుతోంది.
దిల్ రాజుకు ఎప్పటి నుంచో బాలయ్యతో సినిమా చెయ్యాలని కోరిక. యాభై సినిమాలు తమ బ్యానర్ లో పూర్తైనా ఆ కోరిక తీరలేదు. అయితే ఆ టైమ్ వచ్చేసింది. 'అఖండ' విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య .. ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. 'అఖండ' సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో సినిమా చేయబోతున్నారట బాలయ్య. ఆ సినిమాకు నిర్మాత దిల్ రాజు అంటున్నారు. మరి డైరక్టర్ ఎవరు...
'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ కోసం పదునైన కథ సిద్ధం చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేయబోతున్నారు. ఇప్పటికే అనీల్ రావిపూడి తో స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని సమచారం. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే నెక్స్ట్ ఎవరితో అనేది హాట్ టాపిక్ రన్ అవుతోంది. ఆ మధ్యన పూరి జగన్నాథ్ పేరు వినిపించింది. అయితే పూరి ...విజయ్ దేవరకొండతో ...లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. అంతేకాదు పూరి ... జనగణమన షూట్ లో విజయ్ దేవరకొండతో బిజీగా ఉన్నారు. కాబట్టి పూరితో ఇప్పట్లో సినిమా లేనట్టే. ఈ నేపధ్యంలో బివియస్ రవి ని డైరక్టర్ గా ఓకే చేసారని సమచారం.
బాలయ్య హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ షోకి బివిఎస్ రవినే డైరెక్ట్ చేయడం, ఆ షో కూడా ఫుల్ సక్సెస్ అవ్వడంతో బాలయ్య అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గోపీచంద్ వాంటెడ్, సాయి ధరమ్ తేజ్ జవాన్ మూవీస్‌కి దర్శకత్వం వహించాడు బివిఎస్ రవి.ఆ రెండు సినిమాలు డిజాస్టర్స్. అయినా కథ నచ్చి బాలయ్య ఓకే చేసారంటున్నారు.
ఇక బివీయస్ రవి కథ ఇచ్చిన నాగ చైతన్య సినిమా ‘థ్యాంక్ యు’ త్వరలో విడుదల కాబోతోంది. అలాగే మరో రెండు స్క్రిప్టు లు సైతం పెద్ద హీరోలకు వినిపించారని, అవి కూడా మెటీరియలైజ్ అయ్యే అవకాసం ఉందని వినికిడి. ఇప్పుడు మాత్రం బాలయ్యతో ఓకే అంటున్నారు కాబట్టి డైరక్టర్ గా మరోసారి మన ముందుకు వచ్చే అవకాసం ఉంది. ఇందుకు సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతుందట. దిల్ రాజుకు సైతం బాలయ్యతో సినమా చేయాలని ఉంది. అది ఇన్నాళ్ళకు ఇలా సెట్ అయ్యిందన్నమాట. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ కూడా త్వరలోనే మొదలుకానుంది.
ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని, చాలా గ్రాండ్‌గా ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం నటీనటుల వేట షురూ చేశారట. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సో.. చూస్తుంటే ఈ ఏడాది కూడా వెండితెరపై బాలయ్య బాబు హంగామాకు కొదవేలేదు అనిపిస్తోంది కదూ!.