Ram: రామ్ బెట్ నాలుగున్నర కోట్లు, గెలిచాడా నాలుగు రెట్లు లాభం

By Surya Prakash  |  First Published Jun 20, 2022, 10:16 AM IST

లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 



సాధారణంగా హీరోలు సినిమా బిజినెస్ విషయంలో దూరటానికి ఇష్టపడరు. తన రెమ్యునేషన్ క్లియర్ అయ్యిందా..నేను బయిటపడ్డానా అనేదాకానే ఆలోచిస్తారు. అయితే కొందరు సీనియర్స్ మాత్రం తాము రెమ్యునేషన్ క్రింద ..కొన్ని ఏరియాలు తీసుకుంటారు. ఇప్పుడు అదే రూటులో రామ్ కూడా వెళ్తున్నాడు. తొలిసారి రామ్ తన తాజా చిత్రం వైజాగ్ రైట్స్ తీసుకున్నాడని సమాచారం. ఇది రామ్ కు ఈ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ అంటున్నారు. వివరాల్లోకి వెళితే...

రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్‌ ఆన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు..' సాంగ్‌ రిలీజై తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్‌ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. ఇప్పుడీ చిత్రం బిజినెస్ జరుగుతోంది.

Latest Videos

ఈ నేపధ్యంలో ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ని నాలుగున్నర కోట్లకు రామ్ తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రా మొత్తం 18 కోట్లకు పలికింది.అందులో వైజాగ్ ఏరియా రామ్ తీసుకోవటంతో మిగతా డిస్ట్రిబ్యూటర్స్ ...ఎంత రేటు చెప్పినా కాదనకుండా తీసుకున్నారని వినికిడి. ఈ సినిమా మొత్తం నలభై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. పందెంకోడితో హిట్‌ దర్శకుడిగా తెలుగునాట పేరు సంపాదించిన లింగుసామి దర్శకత్వం వహించటం, రామ్ నటిస్తున్న మాస్ సినిమా కావటంతో ఈ రేటు పలికినట్లు చెప్పుకుంటున్నారు.

టీజర్ లోని 'పాన్‌ ఇండియా సినిమా చూసుంటారు, పాన్‌ ఇండియా రౌడీలను చూశారా? డియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌.. వీలైతే మారిపోండి, లేదంటే పారిపోండి' అని రామ్‌ చెప్పిన డైలాగులు బాగున్నాయి. యంగ్‌ హీరో ఆది పినిశెట్టి విలన్‌ రోల్‌లో కనిపించగా హీరోయిన్‌ కృతీశెట్టి అందచందాలతో ఆకట్టుకుంటోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ మూవీలో నటుడు శింబు బుల్లెట్‌ సాంగ్‌ను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం.  ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్. మరి మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న లింగుస్వామి, ఉస్తాద్ రామ్ కు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.

 

click me!