బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో.. పాన్‌ ఇండియా ప్లాన్‌!

Published : Apr 11, 2020, 09:44 AM IST
బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో.. పాన్‌ ఇండియా ప్లాన్‌!

సారాంశం

అల్లు అర్జున్‌ పుష్ప పాన్ ఇండియా సినిమా కావటంతో కీలక పాత్రలకు జాతీయ నటులను తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడైతే కరెక్ట్‌ అని భావిస్తున్నారట. అందుకే హిందీ హీరో సంజయ్‌ దత్‌, లేదా సునీల్‌ శెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తురన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ సినిమతో కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్ తో పాటు ఇండస్ట్రీ హిట్‌ సాధించిన బన్నీ తన నెక్ట్స్ సినిమాతో మరో భారీ ప్లాన్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు బన్నీ. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

పుప్ప పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అన్ని భాషల్లో టైటిల్‌, ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లో నటీనటుల ఎంపిక పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.

పాన్ ఇండియా సినిమా కావటంతో కీలక పాత్రలకు జాతీయ నటులను తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడైతే కరెక్ట్‌ అని భావిస్తున్నారట. అందుకే హిందీ హీరో సంజయ్‌ దత్‌, లేదా సునీల్‌ శెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తురన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాలోని మరో కీలక పాత్రకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గందపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?