Balakrishna:బాలయ్య ఇలా ట్విస్ట్ ఇస్తాడని చిరు ఊహించి ఉండరు

By Surya Prakash  |  First Published Jul 6, 2022, 9:43 AM IST


బాలయ్య,చిరు మధ్య చాలా కాలంగా పోటీ ఉంది. ఇద్దరి సినిమాలను వారి అభిమానులు పోటీగా చూస్తూంటారు. అందుకే రిలీజ్ విషయాల్లో ఇద్దరూ టైమ్ చూసి వదులుతూంటారు. బాలయ్య గత కొంతకాలంగా మంచి ఫామ్ లో ఉన్నారు. చిరు..ఆచార్య డిజాస్టర్ తో కాస్త వెనక్కి తగ్గారు. 


సాధారణంగా రెండు పెద్ద సినిమాలు పోటీ పడేది కేవలం సంక్రాంతి సమయంలోనే. మరోసారి జరిగే అవకాసం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సినిమా పెద్దలు. అయితే ఈ సారి రెండు పెద్ద స్టార్స్ సినిమాలు దసరాకు పోటీ పడే అవకాసం కనపడుతోంది. ఆ స్టార్స్ మరెవరో కాదు చిరంజీవి, బాలయ్య.

చిరంజీవి తన తాజా చిత్రం గాడ్ పాధర్ ని దసరా 2022కు తీసుకువస్తామని అఫీషియల్ గా ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు పోటీగా బాలయ్య సినిమాని దింపుతున్నట్లు సమాచారం. ఇలా చేయటం ద్వారా ఏ సినిమా వర్కవుట్ అవుతుందంటూ మీడియా కథనాలు రాస్తుంది. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమ హీరో సినిమానే పెద్ద హిట్ అవుతుందంటూ రెండు సినిమాలకు చర్చలు జరుపుతూ,యుద్దాలు చేస్తూ ఫ్రీగా ప్రమోట్ చేసేస్తారు. ఇవన్నీ గమనించేనేమో బాలయ్యకూడా తను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాని దసరాకు దింపుతున్నట్లు సమాచారం. 

Latest Videos

జై బాలయ్య టైటిల్ తో రూపొందే ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా సైతం దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకుంటానికే సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్క్ స్పీడు చేసారట. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.

ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  

click me!