అంజలిని ఫైనలైజ్ చేసిన అల్లు అరవింద్, మిగతా క్యారక్టర్స్ లో ఎవరంటే..

By Surya PrakashFirst Published Aug 10, 2021, 8:58 AM IST
Highlights

తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట.


కుంచాకో బోబన్ - జోజు జార్జ్ - నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'నాయట్టు' (తెలుగులో 'వేట') చిత్రానికి మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  

రీసెంట్ గా గీతా ఆర్ట్స్ వారు మలయాళంలో వచ్చిన ‘నాయాట్టు’ రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు తమిళ,కన్నడ, తెలుగులో రీమేక్ అవ్వబోతోంది.  తమిళ వెర్షన్ ని గౌతమ్ మీనన్ డైరక్ట్ చేయబోతున్నారు. తెలుగులో కూడా ఆయనే చేస్తారా లేక వేరే వారు చేస్తారా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయన కనుక చేయకపోతే ఓ యంగ్ డైరక్టర్ ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి ఒక నెలలో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తారు. థియోటర్ లో మొదట వేసి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆహాలో వస్తుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నటీనటుల సెలక్షన్ మొదలైపోయింది.

మలయాళంలో నిమిషా సజయన్ పోషించిన కానిస్టేబుల్ పాత్రకు నేచురల్ బ్యూటీ తెలుగమ్మాయి అంజలి ని ఫైనలైజ్ చేసారట. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం రావు రమేష్ ని తీసుకున్నారని అనుకుంటున్నారు. కుంచాకో బోబన్ పాత్ర కోసం సత్యదేవ్ ని సంప్రదిస్తున్నారని టాక్.

మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాహి కబీర్ కథ అందించారు. రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారు.. అధికారం చేతిలో ఉంటే నాయకులు ఎవరినైనా ఎలా వేధింపులకు గురి చేస్తారు.. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేస్తుంది.. అనే అంశాలను ఈ చిత్రంలో చూపించారు. 

click me!