#Bigg Boss6:అభినయశ్రీ తో పాటు 'బిగ్ బాస్' కు సెలెక్ట్ అయ్యింది వీళ్లే (లిస్ట్)

By Surya Prakash  |  First Published Aug 28, 2022, 9:39 AM IST


 బిగ్ బాస్ సీజన్6 కు వెళ్లే కంటెస్టెంట్ల జాబితా ఫైనల్ అయింది.గతంలో వినిపించిన పేర్లలో కొంతమంది ఈ జాబితాలో ఉండగా మరి కొందరు కొత్తగా ఈ జాబితాలో చేరడం గమనార్హం. 



తెలుగు సినీ నటి అభినయశ్రీ చాలా సినిమాలలో నటించింది గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా స్పెషల్ సాంగ్ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా లో అ అంటే అమలాపురం పాటతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈమె తల్లి కూడా అలనాటి తెలుగు నటి అనురాధ. తొలిసారిగా స్నేహమంటే ఇదేరా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.ఇక 2014 లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది అభినయశ్రీ.వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షో లలో హోస్ట్ గా చేసింది.తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలలో హోస్ట్ గా చేసింది.ఇదిలా ఉంటే గత కొద్దికాలంగా అభినయశ్రీ  ఫామ్ లో లేదు. ఎక్కడా వినపడటం లేదు. కానీ ఇప్పుడు ఇంతకాలానికి మళ్లీ ఆమె పేరు వినపడుతోంది. అందుకు కారణం బిగ్ బాస్ షో.

Latest Videos

 బిగ్ బాస్ సీజన్6 కు వెళ్లే కంటెస్టెంట్ల జాబితా ఫైనల్ అయింది.గతంలో వినిపించిన పేర్లలో కొంతమంది ఈ జాబితాలో ఉండగా మరి కొందరు కొత్తగా ఈ జాబితాలో చేరడం గమనార్హం. ఈ జాబితాలో ఉన్న కంటెస్టెంట్లలో మెజారిటీ కంటెస్టెంట్లు బిగ్ బాస్6 లో కచ్చితంగా కనిపించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఈ జాబితాలో కొత్తగా చేరిన వాళ్లలో అభినయశ్రీ ఒకరు.

ఇక కంటెస్టెంట్స్ ఎవరనే విషయానికి వస్తే.. ఇప్పటికే చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. చివరి నిమిషం వరకూ సెలెక్ట్ చేసిన 25 మంది లిస్ట్‌లో ఫైనల్ అయ్యే వాళ్ల వివరాలను సీక్రెట్‌గానే ఉంచగా.. లీకైన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయే 19 మంది కంటెస్టెంట్స్ వివరాలు మీకోసం. 
 

1. బాలాదిత్య (Baladitya)
2.యూట్యూబర్ ఆదిరెడ్డి (Youtuber Adi Reddy)
3. హీరో అర్జున్ కళ్యాణ్ - (Arjun Kalyan)
4. రాజశేఖర్ (Rajasekhar) (కామన్ మేన్)
5. సుదీప (Sudeepa Pinky)-నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ
6. జబర్దస్త్ ఫైమా (jabardasth Faima)
7. జబర్దస్త్ చలాకీ చంటి (Chalaki Chanti)
8. గలాటా గీతు (Galatta Geetu)
9. శ్రీహాన్ (Actor Srihan)
10. సింగర్ రేవంత్ (Singer Revanth)
11. దీపిక పిల్లి (Deepika Pilli)
12. వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan)
13. యాంకర్ ఆరోహి రావ్ అలియాస్ ఇస్మార్ట్ అంజలి (Ismart Anjali)
14. తన్మయ్ (Tanmai)
15. సీరియల్ నటి శ్రీ సత్య (Serial Actress Sri Satya)
16. అభినయ శ్రీ (Abhinayashree)
17.రోహిత్ (Rohit Sahni) సీరియల్ నటుడు
18. మెరీనా అబ్రహాం (Marina Abraham) సీరియల్ నటి
 19. ఆర్జే సూర్య (ఆప్షనల్)
20. ఇనయ సుల్తాన-ఆర్జీవీ హీరోయిన్ -Inaya Sultana (ఆప్షనల్)
 

click me!