బింబిసార చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్, వారినా హుస్సెన్‌లు కథానాయికలుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు ఘన విజయం సాధించాయి.
హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి ఫామ్ లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో క్రేజీ ప్రాజెక్టు ‘బింబిసార’. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి ఓ రేంజిలో రెస్పాన్స్ రాగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ప్రీ రిలీజ్ మొదలైంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు థియేటర్ రైట్స్ నిమిత్తం 15 కోట్లు వచ్చాయి. అయితే ఈ సినిమాపై 40 కోట్లు పెట్టినట్లు సమాచారం. దాంతో ఓటిటి, శాటిలైట్ వాటి మరో పది కోట్లు వరకూ వచ్చినా పెట్టుబడికి తగిన రికవరీ లేనట్లే. అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్టయితే ఈ సినిమా రెండో,మూడో పార్ట్ లలో ప్రాఫిట్స్ తో ఈ లోటుని పూడ్చుకునే అవకాసం ఉందంటున్నారు. అప్పటిదాకా ఇది కాస్ట్ ఫెయిల్యూర్ క్రిందే లెక్క అంటున్నారు. అయితే ఈ లెక్కలు అన్ని అఫీషియల్ కాదు. ట్రేడ్ లో మీడియాలో చెప్పుకోబడుతున్నవే అని గమనించాలి.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 29న శిల్పకళా వేదికలో జరుగునుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఈ వార్త నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇక బింబిసార చిత్రానికి ఫ్రాంచైజీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కళ్యాణ్‌రామ్ ఇటీవలే తెలిపాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఒక పార్టులో భాగమవుతాడని కూడా చెప్పాడు. బింబిసార చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్, వారినా హుస్సెన్‌లు కథానాయికలుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు ఘన విజయం సాధించాయి.