రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

First Published Jan 5, 2020, 7:50 AM IST

అమరావతి చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.. ఈ నెలాఖరుకు అమరావతి భవితవ్యం తేలనుంది.

రాజధాని చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు నివేదిక ఇవ్వడంతో రాజధాని అంశం కీలక ఘట్టానికి చేరుకొంది. రాజధాని అంశంపై జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు నివేదికలు ఇవ్వడంతో ఏపీలో రాజధాని అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
undefined
గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన జీఎన్ రావు కమిటీ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదిక ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికలపై చర్చించనుంది.
undefined
ఈ రెండు నివేదికలపై హై పవర్ కమిటీ అధ్యయనం అధ్యయనం చేయనుంది ఈనెల 20వ తేదీ లోపు గా ఈ రెండు కమిటీల నివేదికల పై హైపవర్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదికను ఇవ్వనుంది.
undefined
ఈ రెండు కమిటీలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మండిపడింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. అమరావతి ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు ఈ నెల 3వ తేదీ నుండి సకల జనుల సమ్మెకు దిగారు.
undefined
జీఎన్ రావు కమిటీపై గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో అమరావతిలో టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయమై ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.ఈ విషయమై సీబీఐ, సీబీసీఐడీ, లోకాయుక్తలలో ఏదో ఒక సంస్థతో విచారణ చేయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ విషయమై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని జగన్ ప్రభుత్వం తలపెట్టింది.
undefined
జీఎన్ రావు, బోస్టన్ కన్సెల్టెన్సీ కమిటీల రిపోర్టులు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. విశాఖ పట్టణంలో రాజధాని, కర్నూల్ లో హైకోర్టు, విశాఖ, అమరావతిలలో హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు విషయాలపై సిఫారసు చేశాయి.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిసర గ్రామాల రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు. సకల జనుల సమ్మెను కూడ ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసులు కూడ నమోదు చేశారు.
undefined
అమరావతి ప్రాంతానికి చెందిన రైతులకు సంఘీభావంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన పర్యటించారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల మీదుగా పవన్ కళ్యాణ్ మందడం వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొన్నారు.సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నందున వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
undefined
కొత్త సంవత్సరం రోజున చంద్రబాబునాయుడు దంపతులు రాజధాని రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. భువనేశ్వరీ తన చేతి గాజులను రాజధాని రైతులకు విరాళంగా ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా పొందిన భూములను కాపాడేందుకు రైతుల దీక్షల్లో పాల్గొన్నారని చంద్రబాబు దంపతులపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలపై టీడీపీ కూడ ఎదురు దాడికి పాల్పడింది.
undefined
ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయమై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. వైఎస్ జగన్ ఇల్లు కూడ అనుమతి లేకుండానే నిర్మించారని టీడీపీ నేతలు చెప్పారు. వైసీపీ నేతలు కూడ భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
undefined
ఏపీకి మూడు రాజధానుల అంశంపై పలు పార్టీల నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారు. అమరావతి కాకపోతే తిరుపతిని రాజధాని చేయాలని మాజీ మంత్రి అమర్ నాథ్ డిమాండ్ చేశారు. తిరుపతిని రాజధానిగా చేయలేకపోతే చిత్తూరు జిల్లాను తమిళనాడు లేదా కర్ణాటక రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేశారు.కర్నూల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత తిక్కారెడ్డి కూడ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.తమను కర్ణాటకలో కలపాలని తిక్కారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
undefined
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంకు రుణం ఎగ్గొట్టిన కేసులో సిబిఐ అధికారులు ఏకకాలంలో నిర్వహించారు. అయితే ఈ కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి సాంబశివరావు ప్రకటించారు రోజువారీ కార్యక్రమాలు కంపెనీ సీఈఓ శ్రీధర్ చూస్తారని రాయపాటి స్పష్టం చేశారు.
undefined
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నీ జనవరి 4వ తేదీన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో గంటల పాటు నిర్బంధించారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కార్యకర్త ఆత్మహత్యాయత్నం ప్రయత్నించారు పోలీసులను దూషించిన కేసులో జెసి దివాకర్ రెడ్డి పోలీసులు నిర్బంధించారు
undefined
click me!