సమ్మర్ హాలీడేస్ కీ, లాంగ్ వీకెండ్స్ కి ట్రిప్స్ కి వెళ్లాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ.. ఎప్పుడూ లోకల్ లో ఏం తిరుగుతాం.. ఒక్కసారైనా ఫారిన్ ట్రిప్ చేస్తే బాగుంటుంది… అక్కడ ఉన్న లొకేషన్స్ మన దేశంలో ఎక్కడ ఉంటాయి అనే భావన కొందరిలో అయినా ఉంటుంది. కానీ.. మన దేశంలోనే…. కొన్ని ప్రదేశాలు చూస్తే… విదేశాలను మించిపోయేలా ఉంటాయి. ఆ ప్లేసులకు వెళితే.. ఏ ఫారిన్ ట్రిప్ కి వెళ్లామా అనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. మరి, ఆ ప్లేసులేంటో చూసేద్దామా…
కజ్జియార్… ఈ ప్రదేశాన్ని భారత స్విట్జర్లాండ్ గా పిలుస్తూ ఉంటారు. ఈ ప్లేస్ లోకి అడుగుపెడితే… స్విట్జర్లాండ్ లోనే ఉన్నామా అనే ఫీల్ కచ్చితంగా కలుగుతుంది. పచ్చని మొక్కలు, కొొండలు ఉండటమే కాదు… చుట్టూ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. ఒక్కసారి వెళ్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనే అనిపిస్తూ ఉంటుంది.
అలెపీ… దీనిని వెన్సీ ఆఫ్ ది ఈస్ట్ అని కూాడా పిలుస్తారు.అలెపీ కేరళలో ఉంటుంది. కేరళ మొత్తం అందంగానే ఉంటుంది. అందులో.. అలెపీ ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి.. బోట్ హౌస్ ఎక్కాల్సిందే.
చిత్రకూట్ ఫాల్స్.. వీటిని ఇండియన్ నయాగారా ఫాల్స్ అని పిలుస్తారు. ఈ ఫాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి. కచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది.
కూర్గ్… దీనిని ఇండియాలోని స్కాట్లాండ్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా చలికాలంలో మంచు కురుస్తుంది. ఈ హిల్ ఏరియా లో ఉదయం పూట మంచు కురుస్తున్న సమయంలో చూడటానికి రెండు కళ్లు సరిపోవు.