మెహందీపూర్ బాలాజీ గుడి (Mehndipur Balaji Temple)
దేశంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాల్లో ఈ మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒకటి. ఈ గుడిలోని దేవుడిని దర్శించుకుంటే దెయ్యాలు, భూతాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు తమ శారీరక, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
ఈ గుడిలో ముఖ్యంగా మూడు దేవుళ్లను పూజిస్తారు. బాలాజీ, భైరవ బాబా, ప్రేతరాజ్ సర్కార్. మెహందీపూర్ బాలాజీ గుడిలోని హారతి, భోగ్ లాంటివి చాలా పవర్ ఫుల్ గా భావిస్తారు. నెగెటివ్ ఎనర్జీల వల్ల బాధపడుతున్న భక్తులకు ఈ గుడి చాలా ఫేమస్.
బ్రహ్మ గుడి పుష్కర్ (Brahma Temple Pushkar) :
ప్రపంచంలో బ్రహ్మ గుళ్లు చాలా తక్కువ ఉన్నాయి. వాటిలో పుష్కర్లోని బ్రహ్మ గుడి ఒకటి. ఈ గుడి బ్రహ్మ దేవుడికి అంకితం చేయబడింది. ఈ గుడిలో బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల విగ్రహం ఉంది. 14వ శతాబ్దంలో కట్టిన ఈ గుడి పుష్కర్ సరస్సు దగ్గర ఉంది. సనాతన ధర్మంలో దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు.
రాక్షసుడైన వజ్రనాభుడిని బ్రహ్మదేవుడి చంపిన తర్వాత దీనిని స్థాపించారని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ ప్రాంతంలో పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు గుమికూడుతారు.