148 ఏళ్ల వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అద్భుతం చేసాడు ఇటలీ ఆటగాడు సిన్నర్. తన దేశ చిరకాల కలను నెరవేర్చి క్రీడా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికాడు. ఇంతకూ అతడు ఓడించింది ఎవరినో తెలుసా?
Wimbledon 2025 Final : ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఇటలీ కుర్రాడు అదరగొట్టాడు... మొదటిసారి టైటిల్ ను ముద్దాడాడు. ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ను (4-6, 6-4,6-4,6-4) జన్నిక్ సిన్నర్ ఓడించాడు. మొదట కాస్త తడబడిన సిన్నర్ తర్వాత పుంజుకుని తొలి వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు.
25
ఆరంభంలో అదరగొట్టిన అల్కరాస్
మొదటి సెట్ అల్కరాస్ దే
మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సిన్నర్ మొదట 2-4తో ఆధిక్యంలోకి వచ్చినా, అల్కరాస్ తన అద్భుతమైన షాట్లతో పుంజుకుని మొదటి సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు.
హోరాహోరీగా సాగిన రెండో సెట్
రెండో సెట్‌లో సిన్నర్ తన ప్రతిభను చాటుకుని 5-4తో ఆధిక్యంలోకి వచ్చాడు. అయితే అల్కరాజ్ తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. చివరికి సిన్నర్ 6-4తో రెండో సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు.
35
సిన్నర్ విజృంభణ
మూడో సెట్
మూడో సెట్ కూడా ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అల్కరాస్ 2-1తో ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ చివరకు సిన్నర్ పుంజుకుని 6-4 తో పైచేయి సాధించాడు.
నాలుగో సెట్ :
విజేతను నిర్ణయించే నాలుగో సెట్ లో సిన్నర్ అద్భుతంగా ఆడాడు. అల్కరాస్ ను ధీటుగా ఎదుర్కొంటూ తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో చివరి సెట్ ను కూడా 6-4 తేడాతో గెలుచుకుని వింబుల్డన్ 2025 విజేతగా నిలిచాడు.
వింబుల్డన్ 2025 లో అల్కరాస్ ను ఓడించి టైటిల్ ను గెలవడమే కాదు తన దేశానికి తొలి టైటిల్ అందించిన ఘటన సిన్నర్ దే. 148 ఏళ్ల వింబుల్డన్ చరిత్రలో ఇటలీ తరపున విజేతగా నిలిచిన మొదటి ఆటగాడు సిన్నర్. అలాగే వింబుల్డన్ ఫైనల్లో ఇప్పటివరకు అల్కరాస్ కు ఓటమన్నదే లేదు... కానీ సిన్నర్ ఓటమిరుచి చూపించిన మొదటి ఆటగాడిగా నిలిచారు.
55
వింబుల్డన్ మహిళల టైటిట్ విజేత స్వియాటెక్
మహిళల సింగిల్స్ ఫైనల్లో పోలాండ్ నకు చెందిన ఇగా స్వియాటెక్, అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో అద్భుతంగా ఆడిన స్వియాటెక్ ప్రత్యర్థి క్రీడాకారిణికి ఏమాత్రం ఛాయిస్ ఇవ్వకుండా 6-0, 6-0 తేడాతో విజయం సాధించింది. స్వియాటెక్ కు కూడా ఇదే తొలి వింబుల్డన్ టైటిల్.