Novak Djokovic: 350 వారాలుగా నెంబర్ వన్.. రికార్డు సృష్టించిన జకొవిచ్.. ఇక నెక్స్ట్ టార్గెట్ దానిమీదే...

First Published | Dec 7, 2021, 1:55 PM IST

Novak Djokovic: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఏడేండ్లుగా  టెన్నిస్ ప్రపంచాన్ని అగ్రస్థానంలో ఏలుతున్న ఈ సెర్బియా ఆటగాడు.. కొత్త చరిత్ర సృష్టించడానికి  సిద్ధమవుతున్నాడు. 

టెన్నిస్ ప్రపంచపు రారాజు, మట్టి కోర్టులో దిగ్గజాలను మట్టికరిపించిన నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల టెన్నిస్ లో సుదీర్ఘకాలం పాటు నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 350 వారాల పాటు అగ్రస్థానంలో ఉండటమంటే మాటలా..? 

క్రీడల్లో నెంబర్ వన్  స్థానానికి చేరుకోవడం ఒక ఎత్తైతే దానిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నెంబర్ వన్ అవడానికంటే.. దానిని నిలబెట్టుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రపంచ క్రీడారంగంలో చాలా మంది క్రికెటర్లు, రన్నర్లు, అథ్లెట్లు.. ప్రపంచ నెంబర్ వన్ సాధించినా అది ఓ ఏడాదో.. రెండేండ్లో.. కానీ..

Latest Videos


సెర్బియా సూపర్  స్టార్ జకోవిచ్ మాత్రం అలా కాదు. దాదాపు ఏడు సంవత్సరాలుగా అగ్రస్థానంలో ఉండటమంటే మాటలా..? కానీ జకోవిచ్ సాధించాడు. ఏటీపీ సింగిల్స్  ర్యాంకింగ్స్ లో ఈ సెర్బియా ఆటగాడు ఏకంగా 350 వారాలుగా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. 

ఏడేండ్లుగా నెంబర్ వన్ గా కొనసాగుతున్న జకోవిచ్.. ఈ క్రమంలో అమెరికా టెన్నిస్ దిగ్గజం పీట్  సంప్రాస్ రికార్డును అధిగమించాడు.  సంప్రాస్.. వరుసగా ఆరేండ్ల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగాడు. 

ఈ ఏడాది మార్చిలో జకోవిచ్.. స్విస్ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ రికార్డు బ్రేక్ చేశాడు. అత్యధిక వారాలు నెంబర్ వన్ (310 వారాలు)గా ఉన్న రికార్డును అధిగిమించాడు. పురుషుల విభాగంలో అత్యధిక వారాలు నెంబర్ వన్ గా ఉన్న ఆటగాడు జకో మాత్రమే. 

350 వారాల రికార్డు పూర్తైన నేపథ్యంలో జకో..  తర్వాత టార్గెట్ జర్మనీ టెన్నిస్ లెజెండ్ స్టెఫీ గ్రాఫ్.. అత్యధిక వారాల పాటు నెంబర్ వన్ గా ఉన్న రికార్డును బీట్ చేయాలనుకుంటున్నాడు. గతంలో ఆమె ఏకంగా 377 వారాల పాటు నెంబర్ వన్ గా కొనసాగింది. ఆ రికార్డును అధిగమించాలంటే జకో  మరో 27 వారాల పాటు నెంబర్ వన్ గా కొనసాగాలి. అయితే నాదల్, రోజర్ ఫెదరర్ లు గాయాలపాలవ్వడం.. ఇతర టెన్నిస్ ఆటగాళ్లు పెద్దగా ఫామ్ లో  లేకపోవడంతో స్టెఫీ గ్రాఫ్ రికార్డును బ్రేక్ చేయడం జకోకు పెద్ద విషయమేమీ కాదు. 

ఇక ఈ ఏడాది మూడు గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబూల్డన్) లు గెలిచిన జకో.. ఒలింపిక్స్ లో స్వర్ణం నెగ్గి రికార్డు సృష్టించాలనుకున్నాడు. కానీ అది వీలుకాలేదు. టోక్యో ఒలింపిక్స్ లో అతడు  సెమీస్ లోనే వెనుదిరిగాడు. 

తన కెరీర్ లో రికార్డు స్థాయిలో 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు సార్లు వింబుల్డన్, మూడు సార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన జకో.. ఇప్పటివరకు 86 మేజర్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. 

click me!