యూఎస్ ఓపెన్‌లో సంచలనం... 18 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఎమ్మా రడకాను...

First Published Sep 12, 2021, 9:50 AM IST

యూఎస్ ఓపెన్ 2021లో సంచలనం నమోదైంది. ఇద్దరు టీనేజర్ల పోటీ పడిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో బ్రిటన్‌కి చెందిన ఎమ్మా రడకాను విజేతగా నిలిచి, రికార్డు క్రియేట్ చేసింది. 

Emma Raducanu

కెనడాకు చెందిన లెలా ఫెర్నాండేజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఎమ్మా... కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది...

2004లో 17 ఏళ్ల వయసులో వింబుల్డన్ విజేతగా నిలిచిన మారియా షరపోవా తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన టీనేజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది ఎమ్మా రడకాను...

ఎమ్మా రడకాను వయసు 18 ఏళ్లు కాగా, ఆమె చేతిలో ఓటమి చెందిన లెలా వయసు 19 ఏళ్లు మాత్రమే. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఎమ్మా ర్యాంకు 150 కాగా, లెలా తన కంటే అత్యుత్తమంగా 73వ ర్యాంకులో కొనసాగుతోంది. 

US Open Final

మహిళల సింగిల్స్‌లో బ్రిటన్‌కి 44 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇదే... ఇంతకుముందు 1977లో బ్రిటన్‌కి చెందిన వర్జీనియా వేడ్, తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది. 

Novak Djokovic

పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా చరిత్ర క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు...
టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ అలెగ్జాండర్ జ్వారెవ్‌తో జరిగిన సెమీస్‌లో ఐదు సెట్ల పాటు పోరాడి విజయం సాధించిన జొకోవిచ్, ఫైనల్‌లో మెద్వెదేవ్‌తో తలబడబోతున్నాడు. 

click me!