హుజూర్‌నగర్‌ ప్రచారానికి రేవంత్‌ను పిలుస్తారా.. : కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఎవరు..?

First Published Sep 27, 2019, 4:14 PM IST

కాంగ్రెస్ పరిస్ధితి చూస్తే పైకి నేతలంతా తాము కలిసిపోయామని చెబుతున్నప్పటికి అంతర్గతంగా మాత్రం కలిసిపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అందరిచూపు యువనేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీదే ఉంది

హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలను అభ్యర్ధులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అధికారపక్షం కావడంతో పాటు అంగబలం, అర్ధబలం ఉన్న నేతను బరిలోకి దింపి టీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉంది.
undefined
ఇదే సమయంలో కాంగ్రెస్ పరిస్ధితి చూస్తే పైకి నేతలంతా తాము కలిసిపోయామని చెబుతున్నప్పటికి అంతర్గతంగా మాత్రం కలిసిపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అందరిచూపు యువనేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీదే ఉంది. హుజుర్‌నగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రేవంత్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిగా ప్రతిపాదించడం చాలా మందికి షాకిచ్చింది.
undefined
దీనిపై స్పందించిన సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. అసలు మా జిల్లా వ్యవహారాల్లో వేలు పెట్టడానికి ఆయనెవరంటూ ఫైరయ్యారు. పార్టీలోకి నిన్నగాక మొన్నొచ్చిన వాళ్లకి అభ్యర్థులను నిర్ణయించేంత సీన్ లేదంటూ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాకుండా హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేస్తారని ఆమెను తామంతా గెలిపించుకుంటామని ప్రకటించారు.
undefined
కోమటిరెడ్డి చెప్పిన కొద్దిరోజుల్లోనే ఉత్తమ్ పద్మావతిని హుజుర్‌నగర్ అభ్యర్ధిగా నిలబెడుతూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన జారీ చేయడంతో రేవంత్ ఖంగుతిన్నారు. ఈపాటికే పీసీసీ చీఫ్‌గా ఉండాల్సిన తనను అడ్డుకున్నారని సీనియర్లపై గుర్రుగా ఉన్న రేవంత్ రెడ్డికి తాజా పరిణామం మరింత కాకపుట్టించింది.
undefined
మరోవైపు టీ.కాంగ్రెస్ పెద్ద తలకాయలంతా హుజుర్‌‌నగర్‌పై ఫోకస్ పెడుతున్నారు. ప్రముఖులు, ఫైర్‌బ్రాండ్లు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తారా అని. ఇప్పటికే సీనియర్ల కామెంట్లతో సైలెంట్ అయిన ఆయన పనిగట్టుకుని అక్కడికి వెళ్లరని గుసగుసలు వినిపిస్తున్నాయి.
undefined
అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిస్తే తాను ప్రచారానికి వెళ్తానని రేవంత్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి పార్టీ ముఖ్యమని రేవంత్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే రేవంత్ ప్రచారం చేయడం వల్ల హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న మాట వినిపించకూడదని సీనియర్లు భావిస్తున్నారట. మరి ఇలాంటి పరిస్ధితుల్లో మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్‌ను ఉత్తమ్ ప్రచారానికి పిలుస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
undefined
click me!