రూట్ క్లియర్ చేసుకుంటున్నారా..?: మోదీకి జై కొట్టిన విజయశాంతి

First Published Aug 7, 2019, 3:56 PM IST

హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ విభజన బిల్లు కేంద్రప్రభుత్వానికి ఎంత మైలేజ్ తీసుకువచ్చిందో లేదో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చుక్కలు చూపించింది. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు వల్ల దేశమంతా ఒకే జెండా, ఒకేరాజ్యాంగం అంటూ బీజేపీ చెప్తుంటే ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 

హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ విభజన బిల్లు కేంద్రప్రభుత్వానికి ఎంత మైలేజ్ తీసుకువచ్చిందో లేదో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చుక్కలు చూపించింది. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు వల్ల దేశమంతా ఒకే జెండా, ఒకేరాజ్యాంగం అంటూ బీజేపీ చెప్తుంటే ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
undefined
జమ్ముకశ్మీర్ విభజన బిల్లు అంశం కాంగ్రెస్ పార్టీని ఓ కుదుపు కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తూ ప్రధాని మోదీ నిర్ణయానికి జై కొడుతున్నారు. మరికొందరైతే పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి మోదీ నిర్ణయానికి బాహాటంగా మద్దతు పలుకుతున్నారు.
undefined
ఇదిలా ఉంటే కొందరు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఆర్టికల్ 370 రద్దుకు బహిరంగంగా మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను బట్టబయలు చేశారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాక్ లపై షాక్ లు ఇస్తూనే ఉన్నారు.
undefined
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సైతం మోదీ నిర్ణయానికే జై కొట్టారు. జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు విజయశాంతి.
undefined
ఇకపోతే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు రాహుల్ గాంధీ కుడిభుజం, కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం కేంద్ర నిర్ణయాన్ని సమర్థించడం శుభపరిణామమన్నారు.
undefined
ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ- నెహ్రూ కుటుంబానికి సన్నిహితుడైన జనార్ధన ద్వివేది కూడా కేంద్ర నిర్నయాన్ని సమర్థించారు. జమ్ము కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు.
undefined
అయితే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు విజయశాంతి. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పుకొచ్చారు.
undefined
కాంగ్రెస్ లోని మెజారిటీ కార్యకర్తలు జమ్ము కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ నేతల అభిప్రాయలను ప్రతిబింబించే విధంగా జనార్ధన ద్వివేదితో పాటూ జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు కూడా కేంద్రనిర్ణయానికి మద్దతు పలికినట్లు తాను భావిస్తున్నానని తెలిపారు.
undefined
అయితే రాబోయే రోజుల్లో వీరితోపాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తారని విజయశాంతి స్పష్టం చేశారు. పార్టీలు వేరైనా దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలోనూ, శత్రు దేశ కుట్రలను తిప్పి కొట్టడంలోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా తమ గళాన్ని వినిపిస్తారనే విషయం సింధియా, ద్వివేది ప్రకటనల ద్వారా మరోసారి రుజువైందని స్పష్టం చేశారు.
undefined
కశ్మీర్ విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు పరిష్కారం లభించాలని, అక్కడి ప్రజలు సుఖ,శాంతులతో జీవనం సాగించాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి స్పష్టం చేశారు.
undefined
ఇకపోతే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ సైతం రాములమ్మకు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తూనే ఉన్నారు. అయితే జమ్ముకశ్మీర్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరంగా కలకలం రేపుతున్నాయి.
undefined
ఇకపోతే విజయశాంతి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె స్తబ్దుగా ఉండిపోయారు. సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
undefined
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో విజయశాంతి తల్లితెలంగాణ పార్టీని స్థాపించడం ఆ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అంతగా ఆదరణ లభించకపోవడంతో ఆమె మళ్లీ బీజేపీలో చేరాలని చూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
undefined
ఇకపోతే సోమవారం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలను బాహాటంగా సమర్థిస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిటా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన జనార్థన్ ద్వివేది కూడా మోదీ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించారు.
undefined
అనంతరం రాహుల్ గాంధీ కుడిభుజం, ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా సైతం కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిచ్చారు. జమ్ముకశ్మీర్ విభజనకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.
undefined
ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి సైతం ప్రధాని మోదీ నిర్ణయానికి తన సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో మోదీ, అమిత్ షాలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
undefined
అయితే జమ్ముకశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న బేదాభిప్రాయాలపై సీడబ్ల్యూసీ చర్చించింది కూడా. ఇదే అంశంపై తీవ్రంగా చర్చించింది. కానీ జమ్ముకశ్మీర్ విషయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై మాత్రం కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు.
undefined
click me!