టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ సంచలన వ్యాఖ్యలు: ఎవరీ అమ్రీష్ పురి?

First Published Jun 5, 2019, 12:53 PM IST

పోలీసుల విచారణ అనంతరం టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అజ్ఞాతం వీడి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే.  విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: పోలీసుల విచారణ అనంతరం టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అజ్ఞాతం వీడి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
undefined
విచారణలో రవిప్రకాష్ పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు నోరు మెదపలేదని చెబుతున్నారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
undefined
తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్‌ అన్ని టీవీలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన సంచలన ప్రకటన చేశారు. మీడియాను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నదెవరు? ఇంతకీ ఆ అమ్రిష్‌పురి లాంటి వ్యక్తి తెలంగాణలో ఎవరున్నారనే అంశాలపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
undefined
మీడియాకు, మాఫియాకు మధ్య యుద్ధం జరుగుతోందని, మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, దొంగ పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారని రవిప్రకాష్ ఆరోపించారు. పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారని ఆయన ఆరోపించారు.
undefined
మోజో టీవీని రూపాయి ఇవ్వకుండా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాష్‌ ఆరోపించారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, మోజో టీవీ ని పెట్టుకున్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరి స్తున్నారని ఆయన అన్నారు.
undefined
కొంతమంది పోలీసులు సహకారం తో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారని అన్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారని ఆయన అన్నారు. పేద రైతుల నుండి దొంగ పత్రాలు సృష్టించి, పొలుసులు , రెవెన్యూ అధికారులు ఒత్తిడి తో ఏ విధంగా అయితే భూమిలు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను అక్రమిస్తున్నారని ఆయన అన్నారు. మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌లంతా పోరాడాలని రవిప్రకాష్‌ పిలుపునిచ్చారు.
undefined
click me!