యాదాద్రి: తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి వెళ్ళే ఘాట్ రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ సమయంలో వాహనాలేవీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.