ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాడె మోసిన మంత్రులు.. పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి..

First Published Nov 23, 2022, 2:22 PM IST

రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఎఫ్ఆర్ వో  అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలు శ్రీనివాసరావు పాడె మోసి నివాళులు అర్పించారు.

FRO srinivasarao

ఖమ్మం : విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాస రావు(45) అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయిల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపుడి లో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. 

FRO srinivasarao

రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలు శ్రీనివాసరావు పాడె మోసి నివాళులు అర్పించారు.

FRO srinivasarao

కుటుంబ సభ్యులు,  అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఏస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు 

FRO srinivasarao

ఆయుధాలు ఇవ్వాలని కోరుతున్నారు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంత్యక్రియలు తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు... ‘వచ్చే  డిసెంబర్ నాటికి పోడు భూములు సంబంధించి  నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. 

FRO srinivasarao

అర్హులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎక్కడా.. ఎలాంటి వ్యతిరేకతా లేదు. అక్రమంగా తెలంగాణకు వలస వచ్చిన గుత్తికోయలు ఇలాంటి దారుణానికి పాల్పడడం సరైంది కాదు. 

FRO srinivasarao

గత కొన్ని ఏళ్లుగా ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. చట్టపరంగా ప్రస్తుతం ఇది సాధ్యం కాదు. ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేసి అటవీశాఖ అధికారులకు ఆయుధాలు కేటాయించాలని ఎంతోమంది ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

FRO srinivasarao

దాడులు చేస్తే ఊరుకోం.. పువ్వాడ అజయ్ 
మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూజజ ఇలాంటి సంఘటనల ద్వారా సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడం ఎవరివల్లా కాదుజ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించడంతో పాటు అడవులను పరిరక్షించే చర్యలపై సిఎం సమీక్షిస్తున్నారుజ ప్రత్యేకంగా గుత్తికోయలు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడాలని చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. అని హెచ్చరించారు

FRO srinivasarao

కాగా, కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఏఫ్ఆర్ వో శ్రీనివాసరావుపై దాడి చేశారు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో మండలంలోని అటవీ భూముల్లో మొక్కల పర్యవేక్షణ అధికారి రామారావుతో కలిసి టు వీలర్ పై ఎఫ్ఆర్ వో వెళ్లారు.  

FRO srinivasarao

అదే సమయంలో ఎర్రబాడు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన చోటా వాచర్ రాములు విధులు నిర్వర్తిస్తున్నారు. మొక్కలు నాటిన చోటా గుత్తికోయలు పశువులు మేపుతున్నారని, తనతో వాగ్వాదానికి దిగుతున్నారు తెలిపారు.దీంతో ద్విచక్రవాహనంపై అక్కడికి చేరుకున్న శ్రీనివాసరావు గుత్తి కోయలతో మాట్లాడారు. ఆ సమయంలోనే వెనక నుంచి ఇద్దరు గుత్తికోయలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. పదునైన కత్తులతో తల, మెడ భాగంలో దాడి చేశారు. కింద పడ్డాక ఆయన గొంతు కోశారు. దీంతో ఎఫ్ఆర్వో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 

click me!