దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

First Published | Jun 27, 2019, 2:12 PM IST

దసరా పర్వదినం తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ఈ దఫా హరీష్ రావుతో పాటు కేటీఆర్‌కు కూడ మంత్రివర్గంలోకి తీసుకొనే  అవకాశం ఉంది.

ఏ పనిని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నా ముహుర్తం చూస్తారు. ఇవాళ్టితో మంచి రోజులు లేవు. దసరా తర్వాతే కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం ఉండేది.
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ఆశించింది. కానీ కేవలం 9 ఎంపీ స్థానాలను మాత్రమే టీఆర్ఎస్ కైవసం చేసుకొంది.

కేసీఆర్ ఆశించినట్టుగా 16 ఎంపీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోలేదు. కేంద్రంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఆధారపడాల్సి వస్తే కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది.
కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కింది. టీఆర్ఎస్‌ కూడ 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. కానీ, కేసీఆర్ అనుకొన్నట్టుగా ఫలితాలు వస్తే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు.కానీ, ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత హరీష్ రావు, కడియం శ్రీహరిలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి అందరి సేవలను ఉపయోగించుకోకపోవడం కూడ కారణమనే ప్రచారం కూడ లేకపోలేదు.
ఈ ఫలితాల తర్వాత కేసీఆర్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి సీనియర్ల సేవలను కూడ ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావించారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేశారనే ప్రచారం కూడ లేకపోలేదు.
దసరా తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఇవాళ్టికే మంచి రోజులు ముగియనున్నాయి. ఈ కారణంగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
దసరా తర్వాత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. విస్తరణలో హరీష్‌రావు, కేటీఆర్‌లకు కూడ చోటు కల్పించే అవకాశం ఉంది. కేటీఆర్‌, హరీష్‌రావులకు గతంలో నిర్వహించిన పోర్ట్ పోలియోలను కేటాయిస్తారా... లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ కు ఐటీ శాఖను కేటాయించే అవకాశం ఉందంటున్నారు. హరీష్ కు నీటి పారుదల శాఖ కాకుండా విద్యా శాఖను కేటాయించే అవకాశం ఉంందని ప్రచారం సాగుతోంది.
గత టర్మ్‌లో కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం దక్కలేదు. ఈ దఫా మహిళలకు తన మంత్రివర్గంలో కేసీఆర్ చోటు కల్పించే అవకాశం ఉంది.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

Latest Videos

click me!